Tollywood : పదిహేనోరోజుకు చేరిన టాలీవుడ్ సమ్మె

టాలీవుడ్ లో సినీ కార్మికుల సమ్మె పదిహేనోరోజుకు చేరుకుంది. కార్మిక సంఘాలు, నిర్మాతల మండలికి మధ్య జరిగిన చర్చలు సఫలం కాలేదు.

Update: 2025-08-18 04:04 GMT

టాలీవుడ్ లో సినీ కార్మికుల సమ్మె పదిహేనోరోజుకు చేరుకుంది. కార్మిక సంఘాలు, నిర్మాతల మండలికి మధ్య జరిగిన చర్చలు సఫలం కాలేదు. దీంతో గత పదిహేను రోజుల నుంచి షూటింగ్స్ నిలిచిపోయాయి. ఈరోజు కార్మిక సంఘాల నేతలు మెగాస్టార్ చిరంజీవిని కలవనున్నారు. అంతుకు ముందు ఫెడరేషన్ కార్యాలయంలో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు.

చర్చలు విఫలం...
గత పదిహేను రోజులుగా రెండు వర్గాల మధ్య జరుగుతున్న చర్చలు ఒక కొలిక్కి రాలేదు. నేడు, రేపు కూడా చర్చలు జరిగే అవకాశముంది. అయితే కార్మిక సంఘాలు పెట్టిన అన్ని డిమాండ్లను అంగీకరించే పరిస్థితుల్లో లేమని నిర్మాతలు చెబుతుండగా, తమకు బకాయీపడిన పదమూడు కోట్ల రూపాయల వేతనాలు చెల్లించాలని కార్మికసంఘాలు పట్టుబడుతున్నాయి.


Tags:    

Similar News