రాజా సాబ్.. నాలుగున్నర గంటలు
'రాజాసాబ్' సినిమా విడుదల వాయిదా పడడం లేదని, డిసెంబరు 5న థియేటర్ విడుదల చేయడానికే ప్రణాళికలు రచించామని నిర్మాత ప్రకటించారు.
'రాజాసాబ్' సినిమా విడుదల వాయిదా పడడం లేదని, డిసెంబరు 5న థియేటర్ విడుదల చేయడానికే ప్రణాళికలు రచించామని నిర్మాత ప్రకటించారు. 'రాజాసాబ్' సినిమా ఈ అక్టోబరు కల్లా మొత్తం సిద్ధం అవుతుందని, డిసెంబరు 5 నే రిలీజ్ కోసం సిద్ధమవుతున్నామని నిర్మాత విశ్వప్రసాద్ తెలిపారు. అభిమానులు, తెలుగు బయ్యర్లు మాత్రం సంక్రాంతికి రావాలని అడుగుతున్నారన్నారు. మూవీ రా ఫుటేజ్ దాదాపు నాలుగన్నర గంటల వరకు వచ్చిందని, దీన్ని 2:30 లేదా 2:45 గంటలకు కుదిస్తామని తెలిపారు. 'రాజాసాబ్' చిత్రానికి రెండో భాగాన్ని కూడా ప్లాన్ చేస్తున్నామని, కాకపోతే అది కొనసాగింపు లేదా సీక్వెల్‌లా ఉండదని, కొత్త స్టోరీతో డిఫరెంట్ యూనివర్స్ సృష్టిస్తామని నిర్మాత చెప్పారు.