టాలీవుడ్ లో కొనసాగుతున్న సమ్మె

నిర్మాతలు, ఫెడరేషన్ సభ్యులతో ప్రొడ్యూసర్ గిల్ట్ సభ్యుల సమావేశం జరిగినా ఫలితం కనిపించలేదు. సమ్మె ముగియలేదు

Update: 2025-08-10 01:37 GMT

నిర్మాతలు, ఫెడరేషన్ సభ్యులతో ప్రొడ్యూసర్ గిల్ట్ సభ్యుల సమావేశం జరిగినా ఫలితం కనిపించలేదు. సమ్మె ముగియలేదు. మూడు విడతల్లో వేతనాల పెంపునకు నిర్మాతలు అంగీకరించారు. వేతనాల పెంపుదలక నిర్మాతలు అంగీకరించారు. మొత్తం మూడు విడతలుగా వేతనాలను పెంచుతామన్న ప్రతిపాదనలను ఫెడరేషన్ ముందు ఉంచారు. తొలి ఏడాది పదిహేను శాతం, తర్వాత ఏడాది ఐదు, మూడో ఏడాది ఐదు శాతం పెంచాలని ప్రతిపాదన చేశారు. వెయ్యి లోపు ఉన్న వారికి తొలి ఏడాది ఇరవై శాతం, మూడో ఏడాది ఐదు శాతం పెంచాలని నిర్ణయించింది.

షరతులివీ...
రెండు వేల లోపు ఉన్న వారికి తొలి ఏడాది పదిహేను శాతం పెంచాలని నిర్ణయించారు. మూడో ఏడాది ఐదుశాతం పెంచాలని నిర్ణయించింది. చిన్న సినిమాలకు పాత వేతనాలే వర్తిస్తాయని పేర్కొంది. టాలీవుడ్ లో కార్మికుల సమ్మెకు పరిష్కారం లభించినట్లే కనపడుతుంది. షరతులకు అంగీకరిస్తేనే వేతనాల పెంపుసాధ్యమని నిర్మాతతలు చెప్పారు. దీనిపై ఎంప్లాయీస్ సినీ ఫెడరేషన్ మాత్రం అంగీకరించలేదు. సినీ కార్మికులను విభజించి పాలించు అన్న రీతిలో ఈ ప్రతిపాదనలు ఉన్నాయని ఫెడరేషన్ అభిప్రాయపడింది. దీంతో నేడు కూడా అంటే ఏడో రోజు కూడా సమ్మె టాలీవుడ్ లో కొనసాగుతుంది.


Tags:    

Similar News