ప్రాజెక్ట్‌ కె: ప్రభాస్ ఫస్ట్ లుక్ వచ్చేసిందోచ్

రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న లేటెస్ట్‌ మూవీ 'ప్రాజెక్ట్‌ కె'. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహిస్తున్న.. ఈ సినిమా భారీ అంచనాలతో తెరకెక్కుతోంది.

Update: 2023-07-19 10:53 GMT

ప్రాజెక్ట్‌ కె: ప్రభాస్ ఫస్ట్ లుక్ వచ్చేసిందోచ్

రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న లేటెస్ట్‌ మూవీ 'ప్రాజెక్ట్‌ కె'. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహిస్తున్న.. ఈ సినిమా భారీ అంచనాలతో తెరకెక్కుతోంది. మొదటి నుంచి ఈ సినిమాపై పాన్‌ ఇండియానే కాదు.. వరల్డ్‌ వైడ్‌గా భారీ బజ్‌ క్రియేట్‌ అయ్యింది. ఈ సినిమాలో ప్రభాస్‌ ఎలా కనిపిస్తాడో అంటూ సినీ లవర్స్‌ ఆసక్తిగా ఎదురుచూశారు. ఇప్పటికే బాలీవుడ్‌ బ్యూటీ దీపికా పదుకునే లుక్‌తో ప్రేక్షకుల్లో మేకర్స్‌ ఆసక్తి రేకెత్తించారు. తాజాగా మేకర్స్‌ ప్రభాస్‌ లుక్‌ని రిలీజ్‌ చేశారు. సూపర్‌ హీరోలా డిజైన్‌ చేసిన ప్రభాస్‌ లుక్‌ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ప్రభాస్ లుక్ చూస్తే యోధుడిగా ఉన్నారు. హాలీవుడ్ సూపర్ హీరోలను తలదన్నేలా ఆయన లుక్ ఉందని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అమెరికాలో ‘ప్రాజెక్ట్‌ కె’ సందడి మొదలైంది.

కామిక్‌ కాన్‌ వేదికపై ప్రచార చిత్రాన్ని ఆవిష్కరించనున్నారు. దీంతో కామిక్‌ కాన్‌ వేదికపై ప్రచురించిన తొలి భారతీయ సినిమాగా చరిత్ర సృష్టించనుంది. ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కింది. ఈ నెల 21న ఈ సినిమా టైటిల్ రివీల్ చేయనున్నారు. ప్రతిష్ఠాత్మకమైన ‘శాన్‌ డియాగో కామిక్ కాన్‌’ ఈవెంట్‌లో చిత్ర యూనిట్‌ పాల్గొంటుంది. ఇప్పటికే ప్రభాస్‌, రానా, కమల్ హాసన్‌ అక్కడకు చేరుకున్నారు. ఇదే వేదికపై టైటిల్‌, ట్రైలర్‌ను విడుదల చేసి, సినిమా రిలీజ్‌ డేట్‌పై క్లారిటీ ఇవ్వనున్నారు. ఈ సినిమాలో మరో కీలక పాత్రలో దిశా పటానీ కనిపించనున్నారు. ఈ భారీ బడ్జెట్‌ చిత్రాన్ని వైజయంతీ మూవీస్‌ సంస్థ నిర్మిస్తోంది. ప్రముఖ నిర్మాత సి. అశ్వనీ దత్ నిర్మిస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి కానుకగా జనవరి 12న సినిమా విడుదల చేయనున్నారు.

Tags:    

Similar News