Hari Hara Veeramallu : వీరమల్లు మూవీపై సూపర్ అప్ డేట్.. ఖచ్చితంగా బ్లాక్ బస్టరేనట

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా విడుదలకు రెడీగా ఉంది.

Update: 2025-07-09 05:45 GMT

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా విడుదలకు రెడీగా ఉంది. జులై 24 వ తేదీన ఈ మూవీ విడుదలకు మేకర్స్ అంతా సిద్ధం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. టాలీవుడ్ లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా పవన్ కల్యాణ్ కు అభిమానులున్నారు. ఇప్పటికే విడుదలయిన ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ అన్ని రికార్డులను బ్రేక్ చేసింది. ఇరవై నాలుగుగంటల్లోనే ఎక్కువ మంది వీక్షించి ట్రైలర్ గా రూపుదిద్దుకుంది. అయితే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన వివాదాలు కూడా చుట్టుముట్టాయి.

వివాదాలు చుట్టుముడుతున్నా...
బీసీ సంఘాలు ఈ మూవీ కధపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. మరొకవైపు చరిత్రను వక్రీకకరించారని ఆరోపిస్తూ న్యాయవాది ఒకరు హెచ్చరించారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన తాజాగా ఒక అప్ డేట్ విడుదలయింది. మూవీరన్ టైమ్ పై నెట్టింట ఆసక్తికర చర్చ జరుగుతుంది. రన్ టైమ్ 160 నిమిషాలుగా చెబుతున్నారు. అంటే రెండు గంటల నలభై నిమిషాల్లో మాత్రమే ఉందని చెప్పడంతో తక్కువ రన్ టైమ్ తో విడుదలవుతున్న చిత్రంగా ఫిలింనగర్ వర్గాలు కూడా చెబుతున్నాయి.
రన్ టైమ్ తక్కువగా ఉందంటూ...
పౌరాణిక, ఆధ్మాత్మిక, చారిత్రక సినిమాలు దాదాపు మూడు గంటలకు పైగానే రన్ టైమ్ ఉంటుంది. కానీ ఇంత తక్కువ రన్ టైమ్ ఉన్న చిత్రంగా కూడా హరిహర వీరమల్లు రికార్డు క్రియేట్ చేయనుందని అంటున్నారు. నెగిటివ్ టాక్ రాకుండా ఉండేదుకు దర్శకుడు రన్ టైమ్ ను తగ్గించినట్లు చెబుతున్నారు. ఆడియన్స్ కు ఎక్కడా బోర్ కొట్టకుండా ఉండేందుకు రన్ టైమ్ తక్కువగా చేశారంటున్నారు. బలమైన కంటెంట్ తో వచ్చే మూవీ అని, ప్రేక్షకులు ఆదరిస్తారని మేకర్స్ చెబుతున్నారు. అందులోనూ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టిన తర్వాత విడుదలవుతున్న తొలి చిత్రం కావడంతో ఫ్యాన్స్ కూడా ఓపెనింగ్స్ తో రికార్డులను బ్రేక్ చేసే అవకాశాలున్నాయి.


Tags:    

Similar News