వీరమల్లుపై బిగ్ అప్ డేట్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పారు. హరిహర వీరమల్లు విడుదల తేదీని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పారు. హరిహర వీరమల్లు విడుదల తేదీని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. వచ్చే నెల 24వ తేదీన హరిహర వీరమల్లు సినిమా విడుదలవుతుందని తెలిపారు. పవన్ కల్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రం రిలీజ్ తేదీలు అనేక సార్లు మారాయి. సాంకేతిక సమస్యలు తలెత్తడంతో అనివార్యంగా వాయిదా వేయాల్సి వస్తుంది.
వచ్చే నెల 24వ తేదీన...
అయితే ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈ సినిమా నిజానికి ఈ నెల 12వ తేదీన విడుదలవుతుందని మొదట చెప్పారు. తర్వాత కొన్ని కారణాల వల్ల ఆ తేదీని మార్చారు. చివరకు వచ్చే నెల 24వ తేదీకి చిత్రం విడుదల ను నిర్ణయించారు. ఈ సినిమా ఏ.ఎం రత్నం నిర్మించగా, కృష్ణం రాజ్ దర్శకత్వం వహించారు. ఈ తేదీ కూడా మళ్లీ వాయిదా వేయకూడదని పవన్ అభిమానులు గట్టిగా కోరుకుంటున్నారు.