చిరంజీవి ఫైట్ మాస్టర్ కు ఎన్ని కష్టాలు వచ్చాయో

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఎన్ని సినిమాలకు ఫైట్ మాస్టర్ గా పని చేశారు కనల్ కన్నన్. ఇప్పుడు ఆయనను తమిళనాడు పోలీసు

Update: 2023-07-12 04:11 GMT

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఎన్ని సినిమాలకు ఫైట్ మాస్టర్ గా పని చేశారు కనల్ కన్నన్. ఇప్పుడు ఆయనను తమిళనాడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోషల్ మీడియాలో పాస్టర్ కు సంబంధించిన ఓ వీడియో షేర్ చేసినందుకు కనల్ కన్నన్ ను అదుపులోకి తీసుకున్నారు. తమిళనాడు సైబర్ క్రైమ్ పోలీసులు నాగర్‌కోయిల్‌లో అరెస్ట్ చేశారు. మతపరమైన మనోభావాలను దెబ్బతీశారంటూ డీఎంకే నేత ఫిర్యాదు చేయడంతో కన్నన్‌ను అరెస్ట్ చేశారు. ఒక యువతితో ఓ పాస్టర్ డ్యాన్స్ చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియోను జూన్ 18న పోస్ట్ చేశారు. ఈ వీడియోలో ఓ యువతితో పాస్టర్ డ్యాన్స్ చేస్తున్నాడు. ఈ వీడియో ద్వారా కొందరి మనోభావాలు దెబ్బతీశారంటూ డీఎంకే ఐటీ విభాగం డిప్యూటీ ఆర్గనైజర్ ఆస్టిన్ బెన్నెత్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. జులై 1న కేసు నమోదు అయింది. విచారణకు పిలిచిన పోలీసులు అరెస్టు చేస్తున్నట్లు తెలిపారు.

కన్నన్ జూన్ 18న పాస్టర్ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్‌ చేశారు. విదేశీ మతాచారాలు ఇలానే ఉంటాయంటూ కనల్ కన్నన్ ఓ యువతితో పాస్టర్ డ్యాన్స్ చేస్తున్న వీడియోను షేర్ చేశారు. ఆ వీడియోకు ఓ తమిళ సాంగ్ ను కూడా జోడించాడు కనల్ కన్నన్. ఆస్టిన్ బెన్నెట్ కన్నన్‌పై పోలీసులకు సమాచారం అందించాడు. నాగర్‌కోయిల్ క్రైమ్ బ్రాంచ్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు ఆధారంగా కనల్ కన్నన్ పై సంబంధిత సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. బెన్నెట్ తన ఫిర్యాదులో ఈ వీడియోను ఎడిట్ చేశారని, క్రైస్తవ మతం ప్రతిష్టను దిగజార్చడానికి, విభిన్న మతాల మధ్య ద్వేషాన్ని ప్రేరేపించే ఉద్దేశ్యంతో ఈ ట్వీట్ చేశారని ఆరోపించారు. విచారణకు హాజరు కావాల్సిందిగా పోలీసులు కన్నన్‌కు సమన్లు ​​జారీ చేయడంతో.. జూలై 10వ తేదీ ఉదయం 10 గంటలకు నాగర్‌కోయిల్ సైబర్ క్రైమ్ బ్రాంచ్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. సాయంత్రం 7 గంటలకు పోలీసులు ఆయన్ను అరెస్టు చేసి జ్యుడిషియల్ రిమాండ్ కోసం జిల్లా మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. ఇది పూర్తిగా డీఎంకే ప్రభుత్వం ప్రేరేపిత కేసని హిందూ సంఘాలు ఆందోళనకు దిగాయి.


Similar News