Pawan Kalyan : పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ బ్యాక్ టు బ్యాక్ ఖుషీ కబురు
పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ బ్యాక్ టు బ్యాక్ ఖుషీ కబురు అందుతుంది.ఉస్తాద్ భగత్ సింగ్ పై క్రేజీ అప్ డేట్ వచ్చేసింది
పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ బ్యాక్ టు బ్యాక్ ఖుషీ కబురు అందుతుంది. రాజకీయాల్లో ఉన్న ఆయన బిజీగా ఉండటంతో ముందుగా అంగీకరించిన సినిమాలను పూర్తి చేసేందుకు పవన్ కల్యాణ్ సిద్ధమవుతున్నారు. ఇటీవల విడుదలయిన హరిహర వీరమల్లు మూవీ ఇచ్చిన కిక్కు నుంచి తేరుకోకముందే పవన్ ఫ్యాన్స్ కు మరో లేటెస్ట్ అప్ డేట్ ఇచ్చింది. హరీశ్ శంకర్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ పై క్రేజీ అప్ డేట్ వచ్చేసింది. ఈ సినిమా షూటింగ్ కు పవన్ కల్యాణ్ టైం కేటాయించడంతో షూటింగ్ శరవేగంగా పూర్తయ్యే అవకాశాలున్నాయి.
ఇద్దరి కాంబినేషన్ లో...
హరీశ్ శంకర్, పవన్ కల్యాణ్ కాంబినేషన్ లో వచ్చిన గబ్బర్ సింగ్ అన్ని రికార్డులను బద్దలు కొట్టడంతో పాటు బాక్సాఫీస్ వద్ద హిస్టరీ క్రియేట్ చేయడంతో ఉస్తాద్ భగత్ సింగ్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇటీవలే ఉస్తాద్ భగత్ సింగ్ క్లైమాక్స్ సన్నివేశాలు కూడా పూర్తి చేశారంటున్నారు. హరిహరవీరమల్లు యావరేజ్ టాక్ వచ్చినా ఉస్తాద్ భగత్ సింగ్ తో అది తుడిచిపెట్టుకుపోతుందని అంటుున్నారు. హరీశ్ శంకర్ క్లైమాక్స్ సీన్ ను అదిరిపోయేలా చిత్రీకరిస్తున్నట్లు చిత్రపరిశ్రమ వర్గాల నుంచి అందుతున్న సమాచారం.
విడుదల తేదీని...
అయితే మేకర్స్ మాత్రం ఈ మూవీ విడుదలపై ఇంకా తేదీని అధికారికంగా విడుదల చేయలేదు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు చాలా రోజులు పట్టే అవకాశముందని చెబుతున్నారు. ఈ మూవీలో రాశీఖన్నాతో పాటు శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని నిర్మిస్తున్నారు. పూర్తి యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్న ఉస్తాద్ భగత్ సింగ్ కు దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వం వహిస్తుండటంతో మరింత హైప్ క్రియేట్ అయింది. ఈ మూవీకి వచ్చిన బజ్ తో పవన్ ఫ్యాన్స్ కు పూనకాలు గ్యారంటీ అని చెబుతున్నారు.