Nani : నాని తీసుకున్న నిర్ణయం కరెక్టేనా? ఫ్యాన్స్ ఒప్పుకుంటారా?

నేచురల్ స్టార్ నాని కేవలం హీరోగా మాత్రమే కాదు నిర్మాతగా కూడా తన అభిరుచిని చూపిస్తున్నాడు.

Update: 2025-06-28 06:07 GMT

నేచురల్ స్టార్ నాని కేవలం హీరోగా మాత్రమే కాదు నిర్మాతగా కూడా తన అభిరుచిని చూపిస్తున్నాడు. నానికి కొత్త కొత్త దర్శకలుతో పనిచేయడం అలవాటు. కొత్తవారిలో టాలెంట్ ను గుర్తించి వారిని ప్రోత్సహించడమే కాకుండా, తనకున్న బిజీలో తాను నటించకపోతే ఆ కథను తాను నిర్మించడానికి కూడా నాని సిద్ధంగా ఉంటాడు. ఇప్పటికే అనేక సినిమాలు నాని నిర్మించాడు. ఇటీవల నాని నిర్మాణ సారథ్యంలో విడుదలయిన కోర్టు అందరినీ ఆకట్టుకుంది. మెగాస్టార్ చిరంజీవి కూడా నానిని ప్రొడ్యూసర్ గారూ అంటూ పిలిచి ఆటపట్టించారంటే నాని రూపొందించే సినిమాలు ఏ స్థాయిలో హిట్ అవుతున్నాయో అర్థమవుతుంది.

కొత్త మూవీకి ఓకే...
నాని తన సినిమాల్లో కథకే ప్రాధన్యం ఇచ్చినట్లుగానే తాను నిర్మిస్తున్న సినిమాలకు కూడా కథాబలం అనుసరించి పాత్రల ఎంపిక ఉంటుందని అంటారు. బిగ్ స్టార్ లతో చేయాలని ఏమీ లేదు. కొత్త నటులను కూడా వెండి తెరకు పరిచయం చేయడంలో నాని ముందుంటారు. నాని తాను నటించే సినిమాల్లో దర్శకుడికి ఎంత ఫ్రీ హ్యాండ్ ఇస్తాడో.. అలాగే తాను నిర్మించే మూవీలో కూడా పాత్రల ఎంపిక నుంచి అన్నింటినీ దర్శకుడికే వదిలేస్తారు. తాజాగా నాని కొత్త మూవీలో నటించడానికి ఓకే చెప్పినట్లు టాలీవుడ్ టాక్.
అతిధి పాత్రలో...
నాని కొత్త ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ కొత్త చిత్రంలో హీరోగా తమిళ హీరో కార్తీ నటిస్తున్నారని ఇండ్రస్ట్రీ వర్గాల టాక్. ఈ కొత్త సినిమాకు దర్శకుడిగా తమిళ ఇండ్రస్ట్రీనుంచి ఎంపిక చేశారట. ఈ కొత్త మూవీలో నాని కూడా అతిధి పాత్రలో కనిపిస్తారని చెబుతున్నారు. డ్రీమ్ వారియర్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుందట. కథ నచ్చడంతో గెస్ట్ రోల్ లో నటించడానికి నాని అంగీకరించినట్లు ఫిలింనగర్ వర్గాల టాక్. సముద్రం లో జరిగే సన్నివేశాలతో ఈ సినిమా తెరకెక్కుతుందని చెబుతున్నారు. సో నాని నేచురల్ స్టార్ మాత్రమే కాదు. వెరైటీ గా కూడా ఆలోచిస్తారనడానికి ఇదే ఉదాహరణ అని అంటున్నారు.
Tags:    

Similar News