"మిథునం" రచయిత శ్రీరమణ కన్నుమూత
బాపు, రమణ, తనికెళ్ళ భరణి.. లాంటి పలువురు రచయితలు, దర్శకుల వద్ద పనిచేసిన సీనియర్ రచయిత శ్రీరమణ(70)..
mithunam writer sri ramana
రెండు నెలలుగా సినీ పరిశ్రమలో వరుస విషాద ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా టాలీవుడ్ లో మరో ప్రముఖ రచయిత అనారోగ్యంతో కన్నుమూశారు. బాపు, రమణ, తనికెళ్ళ భరణి.. లాంటి పలువురు రచయితలు, దర్శకుల వద్ద పనిచేసిన సీనియర్ రచయిత శ్రీరమణ(70) బుధవారం వేకువజామున 5 గంటలకు తుదిశ్వాస విడిచారు. శ్రీరమణ మరణంతో చిత్రపరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రముఖ దర్శక, నిర్మాతలు.. నటీనటులు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు.
శ్రీరమణ జర్నలిస్ట్ గా కెరియర్ ను మొదలు పెట్టారు. తొలుత నవ్య అనే వార్తాపత్రికకు ఎడిటర్ గా పనిచేసిన ఆయన.. ఆ తర్వాత కథా రచయితగా సినిమాల్లోకి అడుగుపెట్టారు. డైలాగ్ రైటర్ గానూ పనిచేశారు. తనికెళ్ళ భరణి దర్శకత్వంలో వచ్చిన "మిథునం" సినిమాకు కథ అందించింది ఈయనే. "మిథునం" సినిమా ఆయనకు ఎంతో పేరు తెచ్చిపెట్టింది. అన్యోన్య దాంపత్యానికి ఈ సినిమా నిలువుటద్దంలా నిలిచింది.