సినిమా ఇండస్ట్రీ మీద పడతారేంటి: చిరంజీవి

మెగాస్టార్‌ చిరంజీవి, మాస్‌ మహరాజా రవితేజ హీరోలుగా నటించిన సినిమా వాల్తేరు వీరయ్య

Update: 2023-08-08 03:07 GMT

మెగాస్టార్‌ చిరంజీవి, మాస్‌ మహరాజా రవితేజ హీరోలుగా నటించిన సినిమా వాల్తేరు వీరయ్య. కే.ఎస్. రవీంద్ర (బాబీ) తెరకెక్కించిన ఈ సినిమా సంక్రాతి కానుకగా విడుదలై బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచింది. సినిమా థియేట్రికల్ రన్ 200 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా మూవీ యూనిట్‌ హైదరాబాద్‌లో ప్రత్యేక సెలబ్రేషన్స్‌ నిర్వహించింది. మెగాస్టార్‌ చిరంజీవి, రవితేజ, దర్శకుడు బాబీతో పాటు హరీష్‌ శంకర్‌, ఉప్పెన బుచ్చిబాబు, గోపీచంద్‌ మలినేని, మైత్రీ మూవీ మేకర్స్‌ అధినేతలు నవీన్ యర్నేని, రవిశంకర్‌ యలమంచిలి తదితరులు హాజరయ్యారు.

వాల్తేరు వీరయ్య 200 రోజులు ఆడినందుకు సంతోషంగా ఉందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఈ విజయానికి గుర్తుగా షీల్డు అందుకున్నందుకు ఒళ్లు పులకరిస్తోంది. చరిత్రను మళ్లీ తిరగరాసినట్లుందని అన్నారు. మెగా స్టార్ చిరంజీవి పొలిటికల్ టచ్ కూడా తన స్పీచ్ లో ఇచ్చారు. మీలాంటి వాళ్లు ప్రత్యేక హోదా గురించి గానీ, రోడ్ల నిర్మాణం గురించి గానీ, ప్రాజెక్టులు గురించి గానీ, పేదవారికి కడుపు నిండే విషయంగానీ, ఉద్యోగ , ఉపాధి అవకాశాలు కల్పించడం వాటి గురించి ఆలోచించాలి. మీలాంటి పెద్దవాళ్ళు ఇలాంటి విషయాల గురించి ఆలోచించి రాష్ట్రాన్ని డెవలప్ చేస్తే అందరూ మీకు తల వంచి నమస్కరిస్తారు. అంతేగాని పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా సినిమా ఇండస్ట్రీ మీద పడతారేంటని అనకండి. ఇదేదో పెద్ద సమస్యలా చూపించకండి అని అన్నారు. ఇటీవల ఏపీలో బ్రో సినిమా కలెక్షన్స్ వివాదం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే..! ఇలాంటి సమయంలో బాస్ ఇలాంటి కామెంట్లు చేశారు. చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమా ఆగస్టు 11న విడుదల కాబోతోంది.


Tags:    

Similar News