Raja Sab : డార్లింగ్ ఫ్యాన్స్ కు లేటెస్ట్ అప్ డేట్.. రాజాసాబ్ రిలీజ్ డేట్ వచ్చేసిందిగా

ప్రభాస్ నటించనున్న రాజాసాబ్ మూవీ కి సంబంధించిన తాజా అప్ డేట్ వచ్చేసింది

Update: 2025-06-03 07:14 GMT

ప్రభాస్ కు ఫ్యాన్స్ మామూలుగా ఉండరు. రెబల్ స్టార్ ప్రభాస్ అంటే ఇష్టపడని వారు ఇండ్రస్ట్రీలోనే కాదు బయట కూడా ఎవరూ ఉండకపోవచ్చు. ప్రభాస్ స్క్రీన్ పై కనిపిస్తే చాలు అని భావించే వారు చాలా మంది ఉన్నారు. ప్రభాస్ కూడా మిస్టర్ కూల్ గా ఇండ్రస్ట్రీలో పేరు తెచ్చుకున్నారు. ప్రభాస్ నిలువెత్తు విగ్రహాన్ని చూసి ఫిదా అయిపోని లేడీ ఫ్యాన్స్ ఉన్నారంటే నమ్మశక్యం కాదు. సినీ నిర్మాతల నుంచి దర్శకులు... కో ఆర్టిస్లులు ఇలా ఒకరేమిటి 24 ఫ్రేమ్స్ లో పనిచేసే వారందరూ ప్రభాస్ తో పనిచేయాలని తహతహలాడుతుంటారు.

16న టీజర్...
ఇక ప్రభాస్ మూవీ విడుదలవుతుందంటే ఎదురు చూసే వారు ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఎక్కువగా ఉంటారు. మహిళ ప్రేక్షకులు చాలా వరకూ డార్లింగ్ మూవీ కోసం కన్నులు ఆర్పకుండా చూస్తుంటారు. ఏదైనా అప్ డేట్ వస్తుందేమోనని సోషల్ మీడియాలో తెగ సెర్చ్ చేయడం కూడా ప్రభాస్ ఫ్యాన్స్ సొంతం. అలాంటి ప్రభాస్ నటించనున్న రాజాసాబ్ మూవీ కి సంబంధించిన తాజా అప్ డేట్ వచ్చేసింది. రిలీజ్ డేట్ తో పాటు టీజర్స్ డేట్ ను కూడా రివీల్ చేయడంతో ఫ్యాన్స్ కు ఇక పండగలాంటి వార్త అని చెప్పాలి.
థియేటర్లలోకి అప్పుడే..
మారుతి దర్శకత్వంలో రాజాసాబ్ మూవీ రూపుదిద్దుకుంది. రొమాంటిక్, కామెడీ, హర్రర్ మూవీగా ఈ మూవీ వస్తుందని ముందుగానే చెప్పడంతో ఇక థియేటర్లలోకి ఎప్పుడొస్తుందా? అని చూస్తున్నారు. అలాంటిది తాజాగా రాజాసాబ్ దర్శకుడు మారుతి రాజ్ సాబ్ మూవీకి సంబంధించి టీజర్ ను ఈ నెల 16వ తేదీన విడుదల చేస్తామని ప్రకటించారు. డిసెంబరు 5వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నట్లు కూడా మేకర్స్ ప్రకటించారు. దీంతో పాటు మరిన్ని అప్ డేట్స్ తో మీ ముందుకు వస్తానంటూ మారుతి సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులతో ఇక ఫ్యాన్స్ ఆగేట్లు కనిపించడం లేదు.




































Tags:    

Similar News