నేను లంచం ఇచ్చా.. సంచలన వీడియోతో వచ్చిన విశాల్

మార్క్ ఆంటోనీ సినిమాతో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చాడు హీరో విశాల్

Update: 2023-09-28 15:11 GMT

మార్క్ ఆంటోనీ సినిమాతో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చాడు హీరో విశాల్. తన సినిమా రిలీజ్ కోసం లంఛం ఇచ్చానని విశాల్ ఒక వీడియోను రిలీజ్ చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్‌ ముంబై కార్యాలయంలో అవినీతి జరుగుతూ ఉందని అన్నారు. నా సినిమా మార్క్ ఆంటోనీ హిందీ వెర్షన్ కోసం 6.5 లక్షలు ఇవ్వాల్సి వచ్చిందని విశాల్ వీడియోలో వివరించారు. మార్క్ ఆంటోని హిందీ వెర్షన్ విడుదల కోసం తాను కేంద్ర సెన్సార్ బోర్డులోని కొందరు వ్యక్తులకు డబ్బు ఇవ్వాల్సి వచ్చిందని హీరో విశాల్ ఆరోపించారు.

మార్క్ ఆంటోని హిందీ వెర్షన్ విడుదల చేసేందుకు రూ.6.5 లక్షలు ఇచ్చానన్నారు. సెన్సార్ సర్టిఫికెట్ కు రూ.3.5 లక్షలు, సినిమా ప్రదర్శించుకునేందుకు మరో రూ.3 లక్షలు... రెండు ట్రాన్సాక్షన్లలో చెల్లించానన్నారు విశాల్. నా కెరీర్ లో ఇటువంటి పరిస్థితిని ఎప్పుడూ ఎదుర్కోలేదన్నారు. సినిమా రిలీజ్ కాకపోతే నష్టపోతామన్న తప్పనిసరి పరిస్థితుల్లో, మరో మార్గం లేక, మేనకా అనే మధ్యవర్తి ద్వారా డబ్బు చెల్లించాల్సి వచ్చింది. భవిష్యత్తులో ఇతర నిర్మాతలకు ఇలాంటి పరిస్థితి ఎదురుకాకూడదనే ఈ విషయాలను బయటపెడుతున్నాను. చెల్లింపులు జరిపాం అనడానికి పక్కా ఆధారాలున్నాయని.. ఎం.రాజన్, జీజా రామ్ దాస్ అనే వ్యక్తులకు నగదు చెల్లించినట్టు బ్యాంకు ఖాతాల వివరాలను కూడా విశాల్ పంచుకున్నారు. తన పోస్టుకు ప్రధాని నరేంద్ర మోదీని, మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండేను ట్యాగ్ చేశారు.



Tags:    

Similar News