డ్రగ్స్ వాడకంపై స్పందించిన హీరో నిఖిల్

ముఖ్యంగా విద్యార్థులు డ్రగ్స్ కు దూరంగా ఉండాలని.. ముందున్న అందమైన జీవితాన్ని పాడుచేసుకోవద్దని సూచించారు. సరదాగా..

Update: 2023-06-24 12:23 GMT

hero nikhil opens on drugs usage

కబాలి నిర్మాత కేపీ చౌదరి డ్రగ్స్ వాడుతూ పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన విషయం తెలిసిందే. ఇటీవలే కేపీ చౌదరి పోలీసు కస్టడీ పూర్తికాగా.. వెలుగులోకి కొందరి పేర్లు వస్తున్నాయి. కేపీ చౌదరి అరెస్టుతో టాలీవుడ్ లో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. తాజాగా.. హైదరాబాద్ లో యాంటీ డ్రగ్స్ విభాగం పోలీసులు ఏర్పాటు చేసిన "పరివర్తన" కార్యక్రమంలో హీరో నిఖిల్, ప్రియదర్శి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిఖిల్ మాట్లాడుతూ.. తనను కూడా చాలాసార్లు డ్రగ్స్ తీసుకోవాలని కొందరు ఆఫర్ చేశారు కానీ.. అలాంటి వాటికి తానెప్పుడూ దూరంగా ఉంటానన్నారు. ప్రతి ఒక్కరూ ఇలాగే సున్నితంగా డ్రగ్స్ వాడకాన్ని తిరస్కరిస్తే.. డ్రగ్స్ వాడకం తగ్గుతుందన్నారు. డ్రగ్స్ కు అందరూ దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు.

ముఖ్యంగా విద్యార్థులు డ్రగ్స్ కు దూరంగా ఉండాలని.. ముందున్న అందమైన జీవితాన్ని పాడుచేసుకోవద్దని సూచించారు. సరదాగా పార్టీలకు వెళ్లినా.. డ్రగ్స్ జోలికి మాత్రం వెళ్లొద్దని విజ్ఞప్తి చేశారు. త్వరలోనే తెలంగాణ డ్రగ్స్ రహిత రాష్ట్రంగా అవ్వాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ఫుట్ బాల్, క్రికెట్ వంటి ఆటలు ఆడండి, సినిమాలు చూడండి... అంతేతప్ప మత్తుకు బానిసలు కావొద్దు అని సలహా ఇచ్చారు. అనంతరం సీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. ఇటీవలే తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరోను ప్రారంభించామని తెలిపారు. సమాజంలో డ్రగ్స్ అనేది పెద్దసమస్యగా మారిందన్న ఆయన.. దేశంలో ప్రస్తుతం 11 కోట్ల మంది డ్రగ్స్ కు బానిసలయ్యారని తెలిపారు. ఆప్ఘానిస్తాన్, పాకిస్తాన్ ల నుంచి డ్రగ్స్ దందా చేస్తున్నారని, విద్యార్థులు వాటికి బానిసలై జీవితాలను పాడుచేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల్లో మార్పు తెచ్చేందుకే ఈ పరివర్తన కార్యక్రమం నిర్వహించినట్లు సీవీ ఆనంద్ తెలిపారు.





Tags:    

Similar News