Peddi : ఫస్ట్ లుక్ లో విలన్ గా ఇరగదీశాడుగా? "పెద్ది" కి తిరుగుండదట

గ్లోబర్ స్టార్ రామచణ్ నటించే పెద్ది మూవీ షూటింగ్ శరవేగంగా పూర్తవుతుంది

Update: 2025-07-12 06:07 GMT

గ్లోబర్ స్టార్ రామచణ్ నటించే పెద్ది మూవీ షూటింగ్ శరవేగంగా పూర్తవుతుంది. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. జాన్వీ కపూర్ ఇందులో హీరోయిన్ గా నటిస్తుండటంతో మరింత అందం తెచ్చినట్లయింది. ఇక రెహమాన్ సంగీతం కూడా ఇప్పటికే ఫ్యాన్స్ ను ఉర్రూతలూగించింది. భారీ బడ్జెట్ తో మైత్రీ మూవీ మేకర్స్ తో పటు సుకుమార్ రైటింగ్స్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈసినిమాకు సంబంధించిన అప్ డేట్స్ అన్నీ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

శరవేగంగా షూటింగ్...
హైదరాబాద్ లోనే పెద్ద సెట్ వేసి షూటింగ్ శరవేగంగా పూర్తి చేసుకుంటుంది. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ ను తాజాగా మేకర్స్ విడుదల చేశారు. ఈ లుక్ లో శివరాజ్ కుమార్ పవర్ ఫుల్ గా కనిపిస్తుంది. ఇందులో శివరాజ్ కుమార్ గౌర్ నాయుడు పాత్రలో కనిపించబోతున్నట్లు దర్శకుడు బుచ్చిబాబు ఇప్పటికే చెప్పారు. మాస్ లుక్ లో రామ్ చరణ్ కు సంబంధించిన గ్లింప్స్ అన్నీ వైరల్ గా మారడమే కాకుండా మెగా ఫ్యాన్స్ ను కూడా ఆకట్టుకున్నాయి. బుచ్చిబాబు కూడా ఈ మూవీపై పూర్తి శ్రద్ధపెట్టి సూపర్ హిట్ కోసం ప్రయత్నిస్తున్నాడు.
గ్రామీణ, స్పోర్ట్స్ నేపథ్యంలో....
స్పోర్ట్స్, గ్రామీణ కథా నేపథ్యంలో సాగే ఈ మూవీకి సంబంధించిన ప్రతి అప్ డేట్ అభిమానులను అలరించింది. సముద్ర తీర ప్రాంతంలో జీవించే ఒక సాధారణ వ్యక్తికి సంబంధించిన జీవనవిధానంతో పాటు ఆ వ్యక్తి జీవితంలో ఎదురయ్యే సవాళ్లు - ప్రతిసవాళ్లతో కథనం ముందుకు సాగుతుందన్న టాక్ టాలీవుడ్ లో వినిపిస్తుంది. ఇప్పటికే పెద్ది మూవీని వచ్చే ఏడాది మార్చి 17వ తేదీన విడుదల చేస్తామని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇప్పుడు విలన్ పాత్రలో కూడా శివరాజ్ కుమార్ అందరినీ కట్టిపడేయడంతో ఇక పెద్దికి తిరుగులేదన్న టాక్ వినపడుతుంది.


Tags:    

Similar News