రష్మిక వీడియో.. ఢిల్లీ పోలీసుల ఎంట్రీ

రష్మిక మందాన డీప్ ఫేక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి

Update: 2023-11-11 02:47 GMT

రష్మిక మందాన డీప్ ఫేక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే!! ఈ ఘటనకు బాధ్యులైన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలంటూ పలువురు ప్రముఖులు తమ స్పందనను తెలియజేసారు. దీంతో ఢిల్లీ పోలీసులు యాక్షన్ లోకి దిగారు. ఢిల్లీ పోలీసులు IPC, 1860 సెక్షన్లు 465,469, IT చట్టం 2000లోని 66C, 66E సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఢిల్లీ మహిళా కమిషన్ (DCW) రష్మిక మందన్న డీప్‌ఫేక్ వీడియోపై స్వయంచాలకంగా విచారణ చేపట్టింది. నవంబర్ 10న ఢిల్లీ పోలీసులకు నోటీసు జారీ చేసింది.ఢిల్లీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ స్వాతి మలివాల్ ఈ కేసులో నమోదైన ఎఫ్‌ఐఆర్ కాపీ, నిందితుల వివరాలు, ఇందుకు సంబంధించి తీసుకున్న చర్యల నివేదికను నవంబర్ 17వ తేదీలోగా సమర్పించాలని పోలీసులను కోరారు. అయితే ఈ కేసులో ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదు.

డీప్ ఫేక్ వ్యవహారంపై రష్మిక స్పందించింది. ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవడం భయానకంగా అనిపిస్తోందని.. నాకే కాదు, మనలో ప్రతి ఒక్కరికీ ఇలాంటి దారుణమైన పరిస్థితి పొంచి ఉందని తెలిపింది రష్మిక. సాంకేతిక పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేస్తుండడమే అందుకు కారణం. ఇవాళ నేను ఒక మహిళగా, నటిగా నా కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. వారే నా రక్షణ వ్యవస్థలు, వారే నాకు వెన్నంటి ఉన్నారని తెలిపింది. ఇలాంటి పరిస్థితే నేను స్కూల్లోనో, కాలేజ్ లోనో చదువుకుంటున్నప్పుడు ఎదురైతే నేను ఏం చేయగలనన్నది ఊహకందని విషయం. అందుకే, ఇలాంటి విషయాలను వెంటనే సామాజికపరంగా చర్చకు పెట్టాలి. మరెంతో మంది ఈ డీప్ ఫేక్ వీడియోల బారినపడకుండా రక్షించాలని రష్మిక కోరింది.


Tags:    

Similar News