చిరంజీవి-సల్మాన్ 'గాడ్ ఫాదర్' సాంగ్ కు భారీగా వ్యూస్

ఈ సినిమాను తెలుగుతో పాటూ, బాలీవుడ్ లోనూ భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు.

Update: 2022-09-23 10:43 GMT

మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కలిసి నటిస్తున్న సినిమా 'గాడ్ ఫాదర్'. ఈ సినిమాను తెలుగుతో పాటూ, బాలీవుడ్ లోనూ భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. దర్శకుడుగా మోహన్ రాజా వ్యవహరిస్తున్న 'గాడ్ ఫాదర్' సినిమా నుండి మొదటి సింగిల్ అయిన 'థార్ మార్' లిరికల్ వీడియోకు భారీగా వ్యూస్ వస్తున్నాయి. ఈ పాటకు ఇప్పుడు యూట్యూబ్‌లో 11 మిలియన్లకు పైగా వ్యూస్ సంపాదించి దూసుకుపోతోంది. తమన్ సంగీతం అందించిన ఈ పాటకు ప్రభుదేవా కొరియోగ్రఫీ చేశారు. సల్మాన్-చిరంజీవి కలిసి.. మంచి స్టెప్స్ వేశారని టాక్ వినిపిస్తోంది. అయితే ఈ స్టెప్స్ లిరికల్ వీడియోలో పెద్దగా చూపించలేదు కానీ.. మిగతా మొత్తం థియేటర్ లో చూపించడం కోసం ప్లాన్ చేశారు మేకర్స్. అనంత శ్రీరామ్ సాహిత్యం అందించిన ఈ పాటను శ్రేయా ఘోషల్ పాడారు.

'గాడ్ ఫాదర్' త్వరలో టాలీవుడ్ లో రిలీజ్ కాబోతున్న బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లలో ఒకటి. ఇందులో నయనతార, సత్య దేవ్, సునీల్, సముద్రఖని కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్‌, సూపర్‌ గుడ్‌ ఫిలింస్‌ పతాకాలపై ఆర్‌.బి.చౌదరి, ఎన్‌వి ప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని కొణిదెల సురేఖ సమర్పిస్తున్నారు. సురేష్ సెల్వరాజన్ కళా దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి నీరవ్ షా కెమెరా మెన్ గా పని చేశారు. 'గాడ్ ఫాదర్' చిత్రాన్ని 2022 దసరా సందర్భంగా అక్టోబర్ 5న తెలుగు, హిందీ భాషల్లో గ్రాండ్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.


Tags:    

Similar News