BigBoss 7 : తెలంగాణ ఎన్నికల్లో బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ ఓటు ఎలా వేస్తారు..?

అసెంబ్లీ ఎన్నికల్లో బిగ్‌బాస్ హోస్ట్ నాగ్ తన ఓటు హక్కుని వినియోగించుకున్నారు. మరి హౌస్ లోని కంటెస్టెంట్స్ ఎలా తమ ఓటు హక్కుని ఉపయోగించుకుంటారు.

Update: 2023-11-30 06:10 GMT

BigBoss 7 : తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్ 7 మొదలయ్యి.. ప్రస్తుతం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం 13వ వారంలోకి అడుగుపెట్టిన ఈ సీజన్ మరో రెండు వారాల్లో ఫినాలే జరుపుకోనుంది. ఇక ఫినాలే టైటిల్ గెలుచుకోవడం కోసం, ఆడియన్స్ నుంచి ఓట్లు పొందే కోసం ప్రతి కంటెస్టెంట్ పోటాపోటీగా టాస్క్ లు అడుగుతున్నారు. ఇది ఇలా ఉంటే, నేడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక తమ ఓటు హక్కుని ఉపయోగించుకునేందుకు ప్రతి ఒకరు పోలింగ్ బూత్ కి చేరుకుంటున్నారు.

ఈక్రమంలోనే టాలీవుడ్ సెలబ్రిటీస్ కూడా పోలింగ్ బూత్ వద్దకి వచ్చి తమ ఓటుని వేస్తున్నారు. బిగ్‌బాస్ హోస్ట్ నాగార్జున కూడా తన ఓటుని వేశారు. అమలతో కలిసి వచ్చి నాగార్జున ఓటు హక్కు వినియోగించుకున్నారు. నాగచైతన్య కూడా నాగ్ వెంటే వచ్చి తన ఓటుని వేశారు. అయితే ఓటు వేసిన నాగార్జున చూసిన కొంతమందికి ఒక సందేహం వచ్చింది. బిగ్‌బాస్ హోస్ట్ వచ్చి తన ఓటు హక్కుని వినియోగించుకున్నారు. మరి హౌస్ లోని కంటెస్టెంట్స్ ఎలా తమ ఓటు హక్కుని ఉపయోగించుకుంటారు అని డౌట్ వచ్చింది.
ప్రస్తుతం ఫినాలేకి దగ్గరిలో ఉన్నారు కాబట్టి కంటెస్టెంట్స్ బయటకి వచ్చి ఓటు వేసే అవకాశం అనేది కష్టమే అని తెలుస్తుంది. మరి ఓటు హక్కుని ఉపయోగించుకోవడం ప్రతి ఒక్కరి హక్కు కదా అంటున్నారా. ఇలా పోలింగ్ బూత్ కి వచ్చి ఓటు వేయలేని సమయంలో బాలట్ ఓటింగ్ ద్వారా ఓటు హక్కు ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. ఇది సాధారణంగా, గవర్నమెంట్ లేదా ఇతర ప్రత్యేక విధుల్లో భాగంగా బయటకి వెళ్లిన వారికీ ఇస్తారు. పోస్టల్ ద్వారా తమ ఓటుని ఉపయోగించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ కూడా అలానే ఓటు హక్కు ఉపయోగించుకునే అవకాశం ఉంది.
Tags:    

Similar News