పూరీ జగన్నాథ్ ఫ్యామిలీ ముందు.. బండ్ల గణేష్ టార్గెట్ చేసింది ఎవరిని..?

'చోర్ బజార్' ప్రీరిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ ఫంక్షన్ లో బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.

Update: 2022-06-23 07:20 GMT

ప్రముఖ సినీ దర్శకుడు పూరీ జగన్నాథ్ కుమారుడు ఆకాశ్ పూరీ తాజా చిత్రం 'చోర్ బజార్' రేపు (జూన్ 24) ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రంలో ఆకాశ్ సరసన గెహన సిప్పీ నటించింది. 'జార్జ్ రెడ్డి', 'దళం' చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు జీవన్ రెడ్డి ఈ సినిమాను తెరకెక్కించారు. ఐవీ ప్రొడక్షన్స్ పతాకంపై వీఎస్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. అల్లూరి సురేశ్ వర్మ సహ నిర్మాతగా వ్యవహరించారు. 'చోర్ బజార్' ప్రీరిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ ఫంక్షన్ లో బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.

ప్రీ రిలీజ్ ఈవెంట్‌ కు పూరీ జగన్నాథ్ హాజరుకాకపోవడంతో బండ్ల గణేష్ సీరియస్ అయ్యారు. ఎంతమందినో స్టార్లను చేశాడు.. సూపర్ స్టార్లను చేశాడు.. డైలాగ్‌లు చెప్పడం రాని వాళ్లకి డైలాగ్‌లు నేర్పాడు.. డాన్స్‌లు రాని వాళ్లకి డాన్స్‌లు నేర్పాడు.. మామూలు వాళ్లని స్టార్లు చేశాడు.. సూపర్ స్టార్లు చేశాడు.. కానీ కన్న కొడుకు సినిమా ఫంక్షన్‌కి మాత్రం రాలేదు. అదే నేనైతే నేను లండన్‌లో ఉన్నా స్పెషల్ ఫ్లైట్ వేసుకుని వచ్చేవాడిని. ఎందుకంటే నేను ఉన్నదే నా కొడుకు కోసం.. నా పెళ్లం కోసం.. నా పిల్లల కోసం.. మా అన్న ఎక్కడ ఉన్నాడో.. ఏం బిజీగా ఉన్నాడో.. ఈసారికి అయిపోయింది కానీ ఇంకోసారి ఇలాంటి పని మాత్రం చేయమాకు. ఎందుకంటే మనం ఏం చేసినా వాళ్ల కోసమే. మనం చస్తే తలకొరివి పెట్టాల్సిందే వాళ్లే. మనం సంపాదిస్తే ఆస్తులు వాళ్లకే.. అప్పులు చేస్తే తీర్చేదీ వాళ్లే. ఆకాష్ అంటే సన్నాఫ్ పూరీ జగన్నాథ్.. ఇంకొకడి పేరు రాస్తా.. రాజ్యాంగం ఊరుకోదంటూ తనదైన స్టైల్ లో వ్యాఖ్యలు చేశారు బండ్ల గణేష్.
పూరీ స్టార్ అయ్యాక చాలామంది వచ్చారు కానీ ముందు వచ్చింది పూరీ భార్య అని చెప్పుకొచ్చారు బండ్ల. సక్సెస్ అయ్యాక ఎన్నో రాంప్ లు, వాంప్ లు వస్తుంటాయ్ పోతుంటాయ్.. అని అన్నారు. తాను దూరంగా ఉంటే మా వదిన, పూరి భార్య లావణ్య ఫోన్ చేసింది ఫంక్షన్ కి రావాలని కోరిందని ఆవిడ కోసమే ఈ ఫంక్షన్ కి వచ్చానని చెప్పుకొచ్చాడు మా వదిన అంటే నాకు ఎంతో ఇష్టమన్న ఆయన ఒక అమ్మ ఎలా ఉండాలి అంటే లావణ్య గారిలా, ఒక అక్క ఎలా ఉండాలి అంటే లావణ్య గారిలా, ఒక భార్య ఎలా ఉండాలి అంటే లావణ్య గారిలా అంటూ ఆమె మీద ప్రశంసల వర్షం కురిపించారు. సీతా దేవిని నేను చూడలేదు కానీ సీతా దేవికి ఉన్నంత ఓపిక ఉంది ఆవిడకి అంటూ తన తల్లిని ఎంత గౌరవిస్తానో.. ఆవిడని కూడా అంత గౌరవిస్తానని అన్నారు. ఎన్నో ర్యాంప్ లు.. వ్యాంప్ లు వస్తుంటాయి… పోతుంటాయి. కానీ అమ్మ శాశ్వతం. జీవితాంతం ఆవిడని గుండెల్లో పెట్టుకుని చూసుకోవాల్సిన బాధ్యత ఆకాష్ ది, పవిత్రది, పూరి అన్నది.. అంటూ కామెంట్స్ చేశాడు.


Tags:    

Similar News