మెగాస్టార్ చిరంజీవిని దురదృష్టవంతుడన్న బేబీ డైరెక్టర్

వైష్ణవి చైతన్య, ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలుగా సాయి రాజేష్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా

Update: 2023-07-31 03:42 GMT

వైష్ణవి చైతన్య, ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలుగా సాయి రాజేష్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'బేబీ'. బేబీ మూవీ మెగా సెలబ్రేషన్స్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి విచ్చేశారు. చిత్ర బృందాన్ని ప్రశంసల్లో ముంచెత్తారు. ఈ ఈవెంట్ లో డైరెక్టర్ సాయి రాజేష్ మాట్లాడుతూ.. మెగాస్టార్ చిరంజీవిని దురదృష్టవంతుడని అన్నారు. అందుకు కారణం మెగాస్టార్ అయిపోవడం కారణంగా మీరు చిరంజీవికి అభిమాని కాలేకపోయారని.. చిరంజీవి ఆరాధిస్తూ తాము మాత్రం ఎంతో అదృష్టవంతులమని చెప్పారు. "మీరు ఒక విషయంలో అన్ లక్కీనో నేను చెప్తాను. ఒక చిరంజీవి అభిమానికి ఉండే అదృష్టం మీకు లేదు. మా లైఫ్ ఎప్పటికి మీరు చూడలేరు. ఏం ఏం చేస్తాం.. ఎలా ఉంటాం అనేది మీకు తెలియదు. అభిమానులుగా మేము బాధలో ఉన్నా, సంతోషంలో ఉన్నా గుర్తొచ్చేది మీరే, వినేది మీ పాటే. మా పారాసిటమాల్ మీరే.. మా మ్యాన్షన్ హౌస్ మీరే.. అది అమెరికా అయినా, చిన్న ఊరిలో ఆటోవాలా అయినా మీ సినిమాలు, మీ పాటలే అసలైన కిక్కు." అని చెప్పగానే ఆడిటోరియం కేకలతో హోరెత్తిపోయింది.

సాయి రాజేష్ మాట్లాడుతూ.. మెగాస్టార్ అభిమానిగా ఎప్పుడూ గర్వపడుతుంటా. హైదరాబాద్ వచ్చిన కొత్తలో చిరంజీవి గారిని కలిస్తే చాలనుకున్నా. బ్లడ్ బ్యాంక్ కు వెళ్లి బ్లడ్ ఇచ్చి వస్తుంటే చిరంజీవిగారు వస్తున్నారని చెప్పారు.. మేము బలంగా అనుకుంటే మీరు తప్పకుండా కలుస్తారు. బేబీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు మీరు రావాలని, వస్తారని అనుకున్నాం. అప్పుడు యూఎస్ లో ఉన్నారు. కానీ మేము గట్టిగా నమ్మాం మమ్మల్ని బ్లెస్ చేసేందుకు మీరు వస్తారని. ఇవాళ సక్సెస్ మీట్ కు వచ్చారని అన్నారు సాయి రాజేష్.
ఇక చిరంజీవి మాట్లాడుతూ.. బేబీ విజయోత్సవ సభకు వచ్చినట్టుగా లేదని, తన సన్మాన సభకు వచ్చినట్టుగా అనిపిస్తోందని అన్నారు. ప్రస్తుతం తన జీవితంలో అనేక మధుర ఘట్టాలు చోటుచేసుకున్నాయని, ఓ వైపు పుత్రోత్సాహం, మరోవైపు తోబుట్టువుల అభివృద్ధి, ఇంకోవైపు మేనల్లుళ్ల ఎదుగుదల, మిత్రులు అభివృద్ది చెందడం చూస్తుంటే ఆ ఆనందం వర్ణనాతీతం అని అన్నారు. అభిమానులు నాకు దేవుడు ఇచ్చిన తమ్ముళ్లు అనుకుంటాను... వీళ్లలో అనేకమంది నన్ను ప్రేరణగా తీసుకుని ఇండస్ట్రీకి వచ్చి విజయాలు సాధిస్తూ తమకంటూ ఓ స్థానం ఏర్పరచుకుంటున్నారని అన్నారు. అభిమానుల ప్రయత్నం ఇంత విజయవంతం అయినందుకు అభినందించాలనే ఈ కార్యక్రమానికి వచ్చానని చిరంజీవి అన్నారు.


Tags:    

Similar News