టాలీవుడ్ లో మరో విషాదం .. సీనియర్ నటి మృతి
టాలీవుడ్ లో మరో విషాదం నెలకొంది. అలనాటి హీరోయిన్ బి.సరోజాదేవి మరణించారు
టాలీవుడ్ లో మరో విషాదం నెలకొంది. అలనాటి హీరోయిన్ బి.సరోజాదేవి మరణించారు. బెంగళూరులోని తన స్వగృహంలో బి. సరోజాదేవి మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈరోజు ఉదయం ఆమె మరణించినట్లు తెలిపారు. బి.సరోజాదేవి 1970వ దశకంలో అనేక చిత్రాల్లో నటించారు. తెలుగు, తమిళ, కన్నడ సినిమాల్లో అనేక సినిమాల్లో హీరోయిన్ గా చేశారు.
మూడు భాషల్లో...
ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎంజీఆర్ ల సరసన కథానాయికగా నటించిన బి.సరోజాదేవి 1942లో కర్ణాటకలో జన్మించారు. 13 ఏళ్ల వయసులోనే చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన బి. సరోజా దేవి దాదాపు రెండువందలకు పైగా సినిమాల్లో నటించారు. 1955 నుంచి 1984 మధ్య కాలంలో దాదాపు మూడు దశాబ్దాల పాటు 161 సినిమాల్లో నటించిన బి.సరోజాదేవి ఆమెకు పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులతో కేంద్ర ప్రభుత్వం సత్కరించింది.