Allari Naresh : మందుతాగి అల్లరి నరేష్ చేసే కామెడీకి కడుపుబ్బ నవ్వాల్సిందేనా?
కామెడీ హీరోలకు పెట్టింది ప్రస్తుతం అల్లరి నరేష్. అల్లరి నరేష్ టైమింగ్, కామెడీకి ప్రజలు ఫిదా అవుతారు. నరేష్ నటించిన ఆల్కాహాల్ మూవీ టీజర్ విడుదలయింది
కామెడీ సినిమాలకు ప్రేక్షకులు ఎక్కువ కనెక్ట్ అవుతారు. అగ్రహీరోలు కూడా ఇప్పుడు కామెడీ మూవీలు చేస్తూ హిట్ లు కొడుతున్నారు. సినిమాకు వెళితే వినోదంతో పాటు హాస్యం ఉంటే ఖచ్చితంగా హిట్ అవుతాయని అనేక సినిమాలు నిరూపించాయి. కామెడీ సినిమాలు ఆదరించినట్లుగా అవి చిన్న మూవీలయినా.. బడా హీరోలయినా ఒకటే. కామెడీకి అంత బజ్ ఉందన్నది అందరికీ తెలిసిందే. అందుకే కామెడీ మూవీలు బాక్సాఫీస్ వద్ద హిట్ అయి నిర్మాతలకు కాసుల వర్షం కురిపించడం ఎక్కువగా చూస్తుంటాం.
కామెడీ కంటెంట్ తో...
ఇక కామెడీ హీరోలకు పెట్టింది ప్రస్తుతం అల్లరి నరేష్. అల్లరి నరేష్ టైమింగ్, కామెడీకి ప్రజలు ఫిదా అవుతారు. ఆయన ప్రతి సినిమా కామెడీతో మిళితమై ఉంటుంది. మధ్యలో కొన్ని సీరియస్ రోల్స్ చేసినప్పటికీ ప్రేక్షకులు మాత్రం అల్లరి నరేష్ ను కామెడీ హీరోగానే చూస్తారు. అల్లరి నరేష్ నటించిన మూవీ మినిమం హిట్ అవుతుందని భావించిన నిర్మాతలు ఆయనతో సినిమా తీసేందుకు ఏమాత్రం వెనకడుగు వేయరు. గతంలో అల్లరి నరేష్ నటించిన అనేక సినిమాలు మంచి హిట్ కొట్టాయి. కానీ గత కొంత కాలం నుంచి నరేష్ కామెడీ మూవీలు విడుదల కాక ప్రేక్షకులు ఒకింత బోర్ ఫీలవుతున్నారు.
టీజర్ విడుదలతో...
అయతే తాజాగా అల్లరి నరేష్ హీరోగా నటిస్తున్న ఆల్కాహాల్ మూవీ చిత్రం షూటింగ్ చేసుకుంటుంది. ఈ మూవీకి మెహర్ రాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్ టైన్ మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్ లపై నాగవంశీ, తివిక్రమ్ భార్య సౌజన్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అయితే అల్లరి నటించిన ఆల్కాహాల్ మూవీకి సంబంధించిన టీజర్ ను మేకర్స్ విడుదల చేశారు. అయితే మద్యం అలవాటు లేని వ్యక్తికి బలవంతంగా లిక్కర్ తాపితే జరిగే పరిణామాలు ఎలా ఉంటాయన్న కోణంలో కథ సాగనుందని తెలిసింది. దీంతో అల్లరి నరేష్ మూవీ మరోసారి ప్రేక్షకులను అలరిస్తుందని మేకర్స్ తో పాటు ఆయన అభిమానులు సయితం భావిస్తున్నారు.