నటుడు విశాల్ కు షాక్.. రూ.15 కోట్లు చెల్లించాల్సిందే !

కానీ.. అప్పు చెల్లించకుండా "వీరమే వాగై సుడుం" సినిమాను విడుదల చేయడంపై లైకా సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. సినిమాను విడుదల చేయడమే

Update: 2022-03-13 08:11 GMT

చెన్నై : నటుడు విశాల్ కు మద్రాస్ హైకోర్టు షాకిచ్చింది. లైకా సంస్థ నుంచి తీసుకున్న రుణానికి సంబంధించిన కేసులో రూ.15 కోట్లు డిపాజిట్ చేయాలని విశాల్ ను ఆదేశించింది. మూడు వారాల్లోగా హైకోర్టు ప్రధాన రిజిస్ట్రార్ పేరును ఆ సొమ్మును డిపాజిట్ చేయాలని ఆదేశాల్లో పేర్కొంది. లైకా సంస్థతో ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం అప్పుగా తీసుకున్న రూ.21.29 కోట్లు చెల్లించాకే "వీరమే వాగై సుడుం" అనే సినిమాను విడుదల చేయాలి.

కానీ.. అప్పు చెల్లించకుండా "వీరమే వాగై సుడుం" సినిమాను విడుదల చేయడంపై లైకా సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. సినిమాను విడుదల చేయడమే కాకుండా శాటిలైట్, ఓటీటీ హక్కులను కూడా అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించింది. వెంటనే సినిమా విడుదల, హక్కుల విక్రయంపై నిషేధం విధించాలని కోరుతూ పిటిషన్ వేయగా.. ఆ పిటిషన్ పై మద్రాసు హైకోర్టు నిన్న విచారణ చేసింది. ఇరువర్గాల వాదనలు విన్న జస్టిస్ సెంథిల్ కుమార్ రామమూర్తి.. విశాల్ రూ. 15 కోట్లు డిపాజిట్ చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈనెల 22వ తేదీకి వాయిదా వేశారు.


Tags:    

Similar News