Pakistan : మీరు మా నీటిని అడ్డుకుంటే.. మేము మీ ఊపిరిని అడ్డుకుంటాం

పాక్ వైఖరిలో ఏ మాత్రం మార్పు రాలేదు. ఇందుకు పాకిస్తాన్ లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం.

Update: 2025-05-23 07:58 GMT

ఆపరేషన్ సిందూర్ తో నూ పాక్ వైఖరిలో ఏ మాత్రం మార్పు రాలేదు. ఇందుకు పాకిస్తాన్ లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. పాక్ లో ఉన్న ఉగ్రవాద స్థావరాలను మట్టు పెట్టినా, వంద మంది ఉగ్రవాదులను హతమార్చినా, సైనిక స్థావరాలను నాశనం చేసినప్పటికీ పాక్ తన వైఖరి మార్చుకోలేదనడానికి ఇది నిదర్శనం.

సింధూ జలాలపై...
ఆయన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ సింధూ జలాలను నిలిపివేయడంపై కరకుగా వ్యాఖ్యానించారు." మీరు మా నీటిని అడ్డుకుంటే.. మేము మీ ఊపిరిని అడ్డుకుంటాం" అంటూ పాకిస్తాన్ లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు భారత్ లోనూ చర్చనీయాంశమయ్యాయి. ఎంతగా దెబ్బతిన్నా పాక్ మారలేదనడానికి ఆయన వ్యాఖ్యలే ఉదాహరణ అని అంటున్నారు.


Tags:    

Similar News