ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలు కన్నుమూత

టౌలన్ లోని తన నర్సింగ్ హోమ్ లో రాండన్ మంగళవారం (జనవరి 17) నిద్రలోనే చనిపోయారని హోమ్ అధికార ప్రతినిధి..

Update: 2023-01-18 06:15 GMT

world's oldest person sister andrie dies at 118

ప్రపంచంలోనే సుదీర్ఘకాలం జీవించి ఉన్న మహిళగా గుర్తింపు పొందిన అత్యంత వృద్ధురాలు ఫ్రెంచ్ మహిళ సిస్టర్ అండ్రే మంగళవారం.. ఫ్రాన్స్ లో కన్నుమూశారు. ఆమె వయసు 118 సంవత్సరాలు. అండ్రే అసలు పేరు లూసిలి రాండన్. టౌలన్ లోని తన నర్సింగ్ హోమ్ లో రాండన్ మంగళవారం (జనవరి 17) నిద్రలోనే చనిపోయారని హోమ్ అధికార ప్రతినిధి చెప్పారు. అండ్రే మొదటి ప్రపంచ యుద్ధానికి దశాబ్దం ముందు 1904, ఫిబ్రవరి 11న ఫ్రాన్స్ లో అలెస్ నగరంలో జన్మించారు. అండ్రే క్రైస్తవ సన్యాసిగా మారి తన జీవితాన్ని జీసస్ కు సేవ చేయడంతో అంకితం చేశారు.

ప్రపంచంలోనే అత్యధిక కాలం జీవిస్తున్న మహిళగా రికార్డుల్లోకి ఎక్కిన అండ్రే.. కన్నుమూయడం బాధాకరమని.. ఆమె ఉన్న మార్సెల్లీ సిటీ నర్సింగ్ హోమ్ ప్రతినిధి తెలిపారు. ‘సిస్టర్ అండ్రే మృతి బాధాకరమే.. అయినా, స్వర్గంలోని తన సోదరుడిని కలుసుకోవాలన్న అండ్రే కోరిక నెరవేరింది’ అంటూ నర్సింగ్ హోమ్ సంతాప ప్రకటన విడుదల చేసింది. అండ్రే మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.


Tags:    

Similar News