సింగపూర్ అధ్యక్షుడిగా థర్మన్ షణ్ముగరత్నం

సింగపూర్ అధ్యక్ష ఎన్నికలలో 70 శాతానికి పైగా ఓట్లను గెలుచుకుని థర్మన్ షణ్ముగరత్నం

Update: 2023-09-02 06:23 GMT

సింగపూర్ అధ్యక్ష ఎన్నికలలో 70 శాతానికి పైగా ఓట్లను గెలుచుకుని థర్మన్ షణ్ముగరత్నం తదుపరి అధ్యక్ష బాధ్యతలను చేపట్టనున్నారు. 12 సంవత్సరాల తర్వాత తొలిసారిగా నిర్వహించిన అధ్యక్ష ఎన్నికల్లో ధర్మన్ షణ్ముగరత్నం దేశానికి తొమ్మిదవ అధ్యక్షుడు అయ్యారు. ఏకంగా 70.4 శాతం ఓట్లను దక్కించుకున్నారు. జిఐసి మాజీ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్ ఎన్‌జి కోక్ సాంగ్ 15.72 శాతంతో రెండో స్థానంలో నిలవగా, ఎన్‌టియుసి మాజీ ఇన్‌కమ్ చీఫ్ టాన్ కిన్ లియాన్ 13.88 శాతం ఓట్లను సొంతం చేసుకున్నారు. పోటీ చేసిన ఎన్నికల్లో గెలుపొందిన మొదటి చైనాయేతర అధ్యక్ష అభ్యర్థి మిస్టర్ థర్మాన్ కావడం విశేషం.

2011 తర్వాత ఆ దేశంలో తొలిసారిగా జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన థర్మన్ షణ్ముగరత్నంను సింగపూర్ ప్రధాని లీ సీన్ లూంగ్ అభినందనలు తెలిపారు. అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన ముగ్గురు అభ్యర్ధులకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎన్నికల్లో భాగమైన ఓటర్లకు, పోటీదారులకు చాలా థాంక్స్. ఇది సింగపూర్ దేశాభివృద్ధికి దోహదం చేస్తుంది అని ప్రధాని లీ సీన్ లూంగ్ అన్నారు. షణ్ముగరత్నం సింగపూర్‌లో 2011 నుంచి 2019 మధ్య కాలంలో ఆర్థిక, విద్యాశాఖ మంత్రిగా, ఉపముఖ్యమంత్రిగా సేవలందించారు. భారత సంతతికి చెంచిన షణ్ముగరత్నం సింగపూర్‌లో జన్మించారు. 2001లో రాజకీయాల్లోకి అడుగుపెట్టి పలు కీలకపదవుల్లో పనిచేశారు. తాజా ఎన్నికల్లో షణ్ముగరత్నం సింగపూర్‌కు తొమ్మిదవ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. షణ్ముగరత్నం అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాక ఆరేళ్ల పాటు ఆయన ఆ పదవిలో కొనసాగనున్నారు.


Tags:    

Similar News