ఇండియా - పాక్ ల మధ్య చర్చలు ప్రారంభం

ఇండియా - పాక్ ల మధ్య చర్చలు ప్రారంభమయ్యాయి.

Update: 2025-05-12 06:47 GMT

ఇండియా - పాక్ ల మధ్య చర్చలు ప్రారంభమయ్యాయి. రెండు దేశాల దేశాల సైనిక కార్యకలాపాల డైరెక్టర్ జనరల్ మధ్య చర్చలు ప్రారంభం అయ్యాయి. హాట్ లైన్ మధ్య ఇరుదేశాలకు చెందిన సైనికాధికారులు అనేక అంశాలపై చర్చించనున్నారు. ఇప్పటికే రెండు దేశాలు అత్యున్నత సమావేశాలు నిర్వహించి నేటి సమావేశంలో చర్చించనున్న కీలక అంశాలపై ఒక అవగాహనకు వచ్చారు.

మోదీ నివాసంలోనూ...
మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో కూడా అత్యున్నత స్థాయి సమావేశం జరుగుతుంది. రెండు దేశాల దేశాల సైనిక కార్యకలాపాల డైరెక్టర్ జనరల్ మధ్య చర్చలకు సంబంధించిన సమాచారాన్ని అధికారులు ఎప్పటికప్పుడు ప్రధాని మోదీకి తెలపనున్నారు. సరిహద్దుల్లో కాల్పుల విరమణ కొనసాగింపుతో పాటు ఉద్రిక్తతల తగ్గింపు పై ప్రధానంగా చర్చించే అవకాశముంది. చర్చల సారాంశాన్ని దేశ ప్రజలకు మీడియా సమావేశం ద్వారా భారత్ తెలియజేయనుంది.


Tags:    

Similar News