Opration Sindoor : టర్కీకి భారతీయ వ్యాపారుల షాక్... ఇక ఆ దేశం వస్తువులు మాకొద్దు
భారత్ పై దాడికి యత్నించిన పాక్ కు సహకరించిన టర్కీని బాయ్ కాట్ చేయాలన్న నినాదం ఊపందుకుంది
ఆపరేషన్ సిందూర్ కు దేశంలో అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తుంది. పౌరసమాజం మాత్రమే కాకుండా అన్ని వర్గాల ప్రజలు భారత సైన్యానికి అండగా నిలుస్తున్నారు. పహాల్గామ్ దాడి తర్వాత జరిగిన ఆపరేషన్ సిందూర్ కు మద్దతు పెరుగుతుంది. ప్రధాని నరేంద్ర మోదీ చెప్పినట్లు ఆపరేషన్ సిందూర్ ఒక పేరు మాత్రమే కాదని కోట్లాది మంది భారతీయుల భావన అని ఆయన చెప్పింది అక్షరాల నిజం. ఎందుకంటే పాక్ అవలంబించిన పద్ధతులు, ఉగ్రవాదులకు ఊతమిచ్చిన ఆ దేశాన్ని ప్రతిఒక్కరూ చీదరించుకుంటున్నారు. ఇప్పుడు అదే సమయంలో మొన్నటి ఆపరేషన్ సిందూర్ తర్వాత పాక్ కు సహకరించిన దేశాలపై కూడా అదే విధ్వేషం ప్రతి భారతీయుల్లో కనపడుతుంది.
టర్కీ ఆయుధాలతో...
పాక్ కు పెద్దగా ప్రపంచంలోని ఏ దేశం నుంచి మద్దతు లభించలేదు. అయితే టర్కీ మాత్రం డ్రోన్లను, క్షిపణులను సరఫరా చేసింది. భారత్ పై పాక్ జరిపిన డ్రోన్లు టర్కీలో తయారయినవేనని భారత సైన్యం ప్రకటించింది. ఫోరెన్సిక్ నిపుణులు పరిశీలించిన తర్వాత దీనిని నిర్ధారించారు. అలాంటి సమయంలో టర్కీ ని కూడా ఇప్పుడు భారతీయులు శత్రువుగా చూడటం ప్రారంభించింది. టర్కీకి మనం భూకంపం సంభవించినప్పుడు ఎంత సాయం చేశామో మరిచిపోయి పాక్ కు నిస్సిగ్గుగా మద్దతు ఇవ్వడాన్ని అందరూ వ్యతిరేకిస్తున్నారు. అందులో భాగంగానే టర్కీ వస్తువులను భారత్ లో బహిష్కించాలన్న నిర్ణయానికి దాదాపు వచ్చినట్లే కనపడుతుంది. బాయ్ కాట్ టర్కీ పేరుతో సోషల్ మీడియాలో హోరెత్తి పోవడంతో ఇప్పుడు పాక్ తర్వాత టర్కీ భారత్ కు టార్గెట్ గా మారిది.
యాపిల్స్ ను...
టర్కీ నుంచి దిగుమతి అయ్యే ప్రతి వస్తువును బహిష్కరించాలని భారతీయ వ్యాపారులు నిర్ణయించారు. స్వదేశంలో ఉత్పత్తి అయ్యే వాటిని మాత్రమే విక్రయించాలని, టర్కీ వస్తువులను బ్యాన్ చేయాలని నిర్ణయించారు. ప్రధానంగా టర్కీ నుంచి భారత్ కు యాపిల్స్ దిగుమతి అవుతాయి. పెద్దయెత్తున దిగుమతి అయ్యే ఈ యాపిల్స్ కు భారత్ లో మంచి డిమాండ్ ఉంది. పూణే మార్కెట్ కు నిత్యం టర్కీ యాపిల్స్ కోట్ల రూపాయల మేరకు దిగుమతి అవుతుంటాయి. ఇప్పుడు వీటిని బహిష్కరించాలని పూణేలోని యాపిల్స్ విక్రయించే వ్యాపారులు నిర్ణయించారు. సీజన్ లో టర్కీ యాపిల్స్ దాదాపు వెయ్యి కోట్ల రూపాయల మేరకు దిగుమతిచేసుకుంటారు. ఇప్పుడు దీనికి ఫుల్ స్టాప్ పెట్టేశారు.
టూరిజాన్ని కూడా బహిష్కరించాలని...
యాపిల్స్ ను టర్కీ నుంచి కాకుండా హిమాచల్ ప్రదేశ్, కాశ్మీర్, ఉతరాఖండ్, ఇరాన్ నుంచి కొనుగోలు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు టర్కీ వస్తువుల బహిష్కరణ నినాదం ఊపందుకుంది. దీంతో టర్కీకి ఈరకంగా భారతీయులు గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకున్నారు. టర్కీ టూరిజానికి కూడా దూరంగా ఉండాలని సోషల్ మీడియాలో పిలుపు నివ్వడంతో దానికి కూడా భారీగా మద్దతు లభిస్తుంది. ఉగ్రవాదానికి సహకరించే దేశానికి మద్దతు ఇవ్వడం ఎంత ప్రమాదకరమో టర్కీకి తమ వంతుగా తెలియజేయయాలని వ్యాపారులు నిర్ణయించారు. మొత్తం మీద టర్కీకి ఇక సినిమా కనపడుతుందని చెప్పాలి.