Neapal : నేపాల్ లో పార్లమెంటు భవన్ ముట్టడి.. కాల్పులు.. 9 మంది మృతి

నేపాల్‌లో సోషల్ మీడియాలో నిషేధానికి వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తాయి. పోలీసులు జరిపిన కాల్పుల్లో తొమ్మిది మంది మరణించారు

Update: 2025-09-08 11:54 GMT

నేపాల్‌లో సోషల్ మీడియాలో నిషేధానికి వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తాయి. యువకులు పెద్ద సంఖ్యలో పార్లమెంటు భవనాన్ని ముట్టడించారు. నేపాల్ భద్రతా సిబ్బందిపై రాళ్లు రువ్వారు. దీంతో జరిగిన కాల్పుల్లో తొమ్మిది మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ఖాఠ్మండులో సోమవారం జరిపిన పోలీసు కాల్పుల్లో కనీసం ఎనిమిది మంది మృతి చెందగా, డజన్ల కొద్దీ నిరసనకారులు గాయపడ్డారు.

సోషల్ మీడియాపై నిషేధానికి వ్యతిరేకంగా...
ప్రభుత్వం సోషల్ మీడియాపై నిషేధం విధించడాన్ని వ్యతిరేకిస్తూ ప్రజలు ముఖ్యంగా యవకులు ఆందోళనకు దిగారు.ఖాఠ్మండు బీర్ హాస్పిటల్‌లో ఆరుగురు, సివిల్ హాస్పిటల్‌లో మరొక ముగ్గురు చికిత్స పొందుతూ మరణించారని అధికారులు తెలిపారు. నిరసనకారులు పార్లమెంట్ భవనాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించగా, పోలీసులు కాల్పులు జరిపారు. గాయపడిన డజన్ల మంది ప్రస్తుతం ఖాఠ్మండులోని అనేక ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని వైద్యులు తెలిపారు.


Tags:    

Similar News