ఆఫ్గాన్‌పై పాక్ సైన్యం రాకెట్ దాడి.. ఆరుగురు మృతి

ఆఫ్గాన్ ను తాలిబన్లు తమ ఆధీనంలోకి తీసుకొచ్చినప్పటి నుంచి పాకిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య సరిహద్దు ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు

Update: 2022-04-17 06:29 GMT

ఆప్ఘనిస్థాన్ : ఆఫ్గాన్ - పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సరిహద్దులోని కునార్‌లోని షెల్టాన్ జిల్లాలో పాక్ సైన్యం రాకెట్ దాడులకు పాల్పడింది. ఈ దాడిలో ఐదుగురు చిన్నారులు, ఓ మహిళ సహా ఆరుగురు మృతి చెందగా.. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఆఫ్గాన్ ప్రాంతీయ సమాచార డైరెక్టర్ నజీబుల్లా హసన్ అబ్దాల్ తెలిపారు. దాడి నేపథ్యంలో తాలిబన్ అధికారులు పాకిస్థాన్ ప్రభుత్వానికి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.

ఆఫ్గాన్ ను తాలిబన్లు తమ ఆధీనంలోకి తీసుకొచ్చినప్పటి నుంచి పాకిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య సరిహద్దు ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆఫ్గాన్ నుంచి మిలిటెంట్ గ్రూపులు తమ దేశంపై దాడికి యత్నిస్తున్నాయని పాకిస్థాన్ ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేసింది. ముఖ్యంగా పాక్ తీవ్రవాదులకు ఆఫ్గన్ తాలిబన్లు ఆశ్రయమివ్వడాన్ని పాక్ తప్పుబడుతోంది. ఇదిలా ఉంటే ఖోస్ట్ ప్రావిన్స్‌లోని డ్యూరాండ్ లైన్ సమీపంలోని నాలుగు గ్రామాలపై పాకిస్తాన్ హెలికాప్టర్లు బాంబు దాడి చేశాయని ఓ అజ్ఞాత వ్యక్తి తెలిపాడు. మరోవైపు ఇందుకు సంబంధించిన ఫుటేజీలను ఆప్గాన్ ప్రభుత్వానికి చెందిన టీవీ ఛానెల్ విడుదల చేసింది.






Tags:    

Similar News