Nepal : దిగివచ్చిన నేపాల్ ప్రభుత్వం... నిషేధం ఎత్తివేత
నేపాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సోషల్ మీడియాపై నిషేధాన్ని నేపాల్ ప్రభుత్వం ఎత్తివేసింది.
నేపాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సోషల్ మీడియాపై నిషేధాన్ని నేపాల్ ప్రభుత్వం ఎత్తివేసింది. నిన్న సోషల్ మీడియాను నిషేధించినందుకు నిరసనగా పెద్ద సంఖ్యలో పార్లమెంటు భవనాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా జరిగిన కాల్పుల్లో పందొమ్మిద మంది మరణించగా, మూడు వందలకు మందికి పైగా గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
19 మంది మరణించడంతో...
అయితే జరిగిన ఘటనపై అత్యవసర భేటీలో నేపాల్ ప్రధాని కేపీ ఓలీ నిర్ణయం తీసుకున్నారు. నిబంధనలు పాటించలేదని సోషల్ మీడియా యాప్స్‌పై వారం క్రితం నిషేధం విధించిన నేపాల్ ప్రభుత్వం నిన్న కాఠ్మాండులో జరిగిన ఆందోళనల్లో చెలరేగిన హింసతో వెనక్కు తగ్గింది. దీనికి బాధ్యత వహిస్తూనేపాల్ హోంమంత్రి రాజీనామా చేశారు. ఆందోళనలకు తలొగ్గి సోషల్ మీడియాపై నిషేధాన్ని నేపాల్ ప్రభుత్వం ఎత్తివేసింది.