Water Bomb: భారతదేశం మా మీద వాటర్ బాంబ్ వేసింది: పాకిస్థాన్

పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారతదేశం సింధు జలాల ఒప్పందాన్ని

Update: 2025-05-24 02:55 GMT

పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారతదేశం సింధు జలాల ఒప్పందాన్ని (IWT) నిలిపివేయడం పాకిస్తాన్ నాయకులను కలవరపెడుతోంది. పాకిస్తాన్ సెనేటర్ సయ్యద్ అలీ జాఫర్ దీనిని వాటర్ బాంబ్ అని అభివర్ణించారు. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్టీకి చెందిన నేత భారతదేశం తీసుకున్న పాకిస్తానీలకు ఊహించని ఎదురుదెబ్బ అని పేర్కొన్నారు.

శుక్రవారం జరిగిన సెనేట్ సమావేశంలో ప్రతిపక్ష పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (PTI) సీనియర్ నాయకుడు జాఫర్ ఈ సంక్షోభాన్ని పరిష్కరించకపోతే విస్తృతమైన పరిణామాలకు కారణమవుతుందని. ప్రజలు ఆకలితో అలమటించేలా చేస్తుందని, సామూహిక మరణాలకు దారితీస్తుందని హెచ్చరించారు. ఇప్పుడు నీటి సంక్షోభాన్ని పరిష్కరించకపోతే ఆకలితో చనిపోతామని, సింధు నదీ పరీవాహక ప్రాంతం పాకిస్థాన్ జీవనాడి అని గుర్తుంచుకోవాలని అన్నారు. పాకిస్థాన్ నీటిలో ఎక్కువ భాగం దేశం వెలుపల నుండి వస్తాయి, 10 మందిలో తొమ్మిది మంది తమ జీవనోపాధి కోసం సింధు నదీ పరీవాహక ప్రాంతంపై ఆధారపడతారన్నారు. మన పంటలలో 90 శాతం ఈ నీటిపైనే ఆధారపడి ఉంటాయన్నారు. అంతేకాకుండా పాకిస్థాన్ అన్ని విద్యుత్ ప్రాజెక్టులు, ఆనకట్టలు దానిపైనే నిర్మించారని జాఫర్ అన్నారు.
సింధు నది వ్యవస్థ నుండి దాదాపు 93% నీటిని పాకిస్తాన్ నీటిపారుదల, విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగిస్తుంది. దాని సాగునీటి భూమిలో దాదాపు 80% దాని జలాలపై ఆధారపడి ఉంటుంది. దాని ఆర్థిక వ్యవస్థ ఎక్కువగా వ్యవసాయాధారమైనది. ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో పాకిస్తాన్, పాకిస్తాన్ ద్వారా శిక్షణ పొందిన ఉగ్రవాదులు 26 మందిని చంపిన తర్వాత భారతదేశం తీసుకున్న దౌత్యపరమైన చర్యలలో సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం ఒకటి.


Tags:    

Similar News