2024 ఎన్నికల్లో ట్విటర్ ఉపయోగించు కోవచ్చు... ఇలాన్ మస్క్ ప్రకటన

మైక్రో బ్లాగింగ్ ప్లాట్ ఫాం X , ఇదివరకటి ట్విటర్ ( గా పిలిచేవాళ్లం) లో అమెరికాలో జరిగే 2024లో అధ్యక్ష ఎన్నికలపై ప్రకటనలు ఇచ్చుకోవచ్చని దాని అధినేత ఇలాన్ మస్క్ తెలిపారు.

Update: 2023-08-31 12:45 GMT

2024 ఎన్నికల్లో ట్విటర్ ఉపయోగించు కోవచ్చు...

ఇలాన్ మస్క్ ప్రకటన

మైక్రో బ్లాగింగ్ ప్లాట్ ఫాం X , ఇదివరకటి ట్విటర్ ( గా పిలిచేవాళ్లం) లో అమెరికాలో జరిగే 2024లో అధ్యక్ష ఎన్నికలపై ప్రకటనలు ఇచ్చుకోవచ్చని దాని అధినేత ఇలాన్ మస్క్ తెలిపారు. X లో 2019 వరకు రాజకీయ పార్టీలు ప్రకటనలు ఇవ్వడం ప్రపంచవ్యాప్తంగా నిషిద్ధం. గత అక్టోబర్ లో ఇలాన్ మస్క్ ట్విటర్ ను కొన్నారు. జనవరి నుంచి ‘కారణానుగుణ ప్రకటనల కోసం చర్యలు తీసుకున్నామన్నారు. ఓటర్ల నమోదుపై అవగాహన కలిగించేందుకే కాకుండా, వివిధ రకాలైన రాజకీయ ప్రకటనలు కూడా చేపట్టవచ్చు. తద్వారా X రెవెన్యూ పొందుతుంది. వచ్చే ఏడాది భారతదేశ పార్లమెంట్ ఎన్నికలు ఉన్నందున మన దేశ రాజకీయ నాయకులు కూడా దీనిని ఉపయోగించుకొని ప్రయోజనం పొందే అవకాశం ఉంది. రాజకీయ విషయాలు తారుమారు కాకుండా ఉండేందుకు ఉద్యోగులను పెంచుతామని, తద్వారా పొలిటికల్ విషయాలపై సంక్షోభం కలగకుండా చూస్తామని మస్క్ తెలిపారు. తప్పుడు కథనాలు, తప్పుదోవ పట్టించే ప్రచారాలను, బోగస్ ఆరోపణలను నిరోధించే విధంగా విధివిధానాలను రూపొందించామని, ఇందుకోసం గ్లోబల్ అడ్వర్ టైజింగ్ ట్రాన్సపరెన్సీ సెంటర్ ను ప్రారంభిస్తామన్నారు. దీంతో X నుంచి తమ రాజకీయ ప్రసంగాలు, ప్రకటనలు ఎలా ప్రమోట్ అవుతున్నాయో తెలుసుకునే అవకాశం ఉంటుంది. బోగస్ ప్రచారాలు, ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని అడ్డుకునే ప్రకటనలు రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని మస్క్ తెలిపారు. X ప్రజల్లో సమైఖ్యతను పెంపొందించే పాలసీని ప్రవేశపెట్టి, ఓటర్లను మోసపుచ్చే ఎటువంటి ప్రకటనలైనా అడ్డుకుంటామన్నారు. అయితే వివాదాలకు కారణమయ్యే ప్రకటనలకు తమకు సంబంధం లేదన్నారు. ట్విటర్ నుంచి X గా మారిన దీనిపైన, సోషల్ మీడియాలపై పార్లమెంటు సభ్యులు, పరిశోధకులు చాలా విమర్శలు చేసిన విషయం తెలిసిందే. అమెరికా అధ్యక్ష ఎన్నికలు ప్రకటనకు ముందు ఇలాన్ మస్క్ అనేక మంది ఉద్యోగులను తీసివేశారు. వారు ఎంత నమ్మకస్తులైనా, సామర్థ్యం కలిగిన వారైనప్పటికీ ఆయన లెక్కచేయకపోవడంపై ఇలాన్ మస్క్ ప్రస్తుతం విమర్శలు ఎదుర్కొంటున్నారు.

ఇకపై సిమ్ లేకుండా ఆడియో, వీడియో కాల్స్

X తర్వలో ఆడియో, వీడియో కాల్ సదుపాయాన్ని కల్పించబోతున్నట్లు ఆ సంస్థ అధినేత ఇలాన్ మస్క్ తెలిపారు. X ప్లాట్‌ఫారమ్‌లో ఇంటిగ్రేటెడ్‌గా ఆడియో, వీడియో కాల్స్ వంటి ఫీచర్లను X చూస్తుందని ఆయన గురువారం ప్రకటించారు. ఈ ఫీచర్ Android, iOS, PC, Macకి అనుకూలంగా ఉంటుందన్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ ఫీచర్ కోసం ఎటువంటి సిమ్ కార్డు ఉపయోగించాల్సిన అవసరం లేదు. ఎటువంటి ఫోన్ నంబర్ లేకుండానే వీడియో, ఆడియో కాల్స్ చేయవచ్చు. ‘Xకి వస్తున్న వీడియో , ఆడియో కాల్స్ – iOS, Android, Mac & PCలో పని చేస్తుంది – ఫోన్ నంబర్ అవసరం లేదు. ‘ X అనేది ప్రభావవంతమైన గ్లోబల్ అడ్రస్ బుక్.. ఇది ప్రత్యేకమైనది’ అంటూ మస్క్ ట్టిట్టర్ హ్యాండిల్ X లో రాశాడు. అయితే ఫీచర్ల లాంచ్ కి సంబంధించి ఎలాంటి తేదీ ఇవ్వలేదు. కానీ ఇందులోని ఫీచర్లన్ని యూనిక్ గా ఉంటాయని మస్క్ వివరించారు.

Tags:    

Similar News