హాట్‌ ఎయిర్‌ బెలూన్‌ ప్రయాణం విషాదాంతం

హాట్ ఎయిర్ బెలూన్ గాల్లోనే పేలిపోయింది. అందులో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది పర్యాటకులు మరణించారు

Update: 2025-06-22 09:45 GMT

హాట్ ఎయిర్ బెలూన్ గాల్లోనే పేలిపోయింది. అందులో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది పర్యాటకులు మరణించారు. ప్రమాద సమయంలో హాట్ ఎయిర్ బెలూన్ లో మొత్తం 22 మంది పర్యాటకులు ఉన్నారు. బ్రెజిల్ లోని దక్షిణ రాష్ట్రమైన శాంటా కాటరినాలో ఈ ప్రమాదం జరిగింది. టూరిజం విభాగానికి చెందిన హాట్ ఎయిర్ బెలూన్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగి ప్రియాగ్రాండే నగరంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో 13మంది ప్రాణాలతో బయటపడ్డారు. వారిని సమీప ఆస్పత్రుల్లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.

Tags:    

Similar News