రేపటి వరకూ ఎయిర్ పోర్టు మూసివేత

లండన్‌ హీథ్రో ఎయిర్‌పోర్ట్‌లో అగ్ని ప్రమాదం జరిగింది.

Update: 2025-03-21 05:44 GMT

లండన్‌ హీథ్రో ఎయిర్‌పోర్ట్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో హీథ్రో ఎయిర్‌ పోర్ట్‌ ను రేపటి వరకు మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. దీంతో ముందుగా టిక్కెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఎయిర్ పోర్టుకు వచ్చి అక్కడ అనుమతి లేకపోవడంతో వెనుదిరిగి వెళ్లిపోతున్నారు. రేపటి వరకూ ప్రయాణికులను ఎవరినీ అనుమతించబోమని అధికారులు తెలిపారు.

అగ్ని ప్రమాదంతో...
హీథ్రో ఎయిర్‌పోర్ట్ లోని ఎలక్ట్రిక్ సబ్‌స్టేషన్‌లో మంటలు రావడంతో అగ్ని ప్రమాదం సంభవించిందని విమానయాన శాఖ అధికారులు తెలిపారు. ఎయిర్ పోర్టులో విద్యుత్‌ సరఫరా ను ముందు జాగ్రత్త చర్యగా నిలిపివేయడంతో రోజు వారీ కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది. ఎయిర్‌పోర్ట్‌కు రేపటి వరకూ రావొద్దని ప్రయాణికులకు విజ్ఞప్తి చేశారు.


Tags:    

Similar News