ట్విట్టర్ సీఈఓగా బాధ్యతలను స్వీకరించిన ఎలాన్ మస్క్.. మొదటి వేటు మనవాడిపైనే..!

Update: 2022-10-28 02:58 GMT

ఏప్రిల్‌లో సోషల్ మీడియా కంపెనీని కొనుగోలు చేయడానికి మొదటి బిడ్ చేసిన నెలల తర్వాత, టెస్లా CEO, ప్రపంచంలోని అత్యంత సంపన్న వ్యక్తి ఎలోన్ మస్క్ గురువారం ట్విట్టర్ యజమాని అయ్యారు. వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రకారం వచ్చీ రాగానే ట్విట్టర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ పరాగ్ అగర్వాల్, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ నెడ్ సెగల్‌లను తొలగించారు. ఇద్దరు ఎగ్జిక్యూటివ్‌లు కంపెనీ శాన్‌ఫ్రాన్సిస్కో ప్రధాన కార్యాలయం నుండి వెళ్లిపోయారు.. వారు తిరిగి వచ్చే అవకాశం లేదని తెలిపారు. ట్విటర్‌లోని ఇండియన్‌ సీఈవో అగర్వాల్‌, సెగల్‌తో పాటు లీగల్‌ పాలసీ, ట్రస్ట్‌, సేఫ్టీ హెడ్‌ విజయ గద్దెలను కూడా తొలగించినట్లు వాషింగ్టన్‌ పోస్ట్‌ పేర్కొంది. ట్విట్టర్‌ తన చేతికి వచ్చిన తర్వాత ఉద్యోగులను భారీగా తొలగిస్తారంటూ వస్తున్న వార్తలపై మస్క్‌ స్పందించారు. 75 శాతం ఉద్యోగులను తాను తొలగించబోనని స్పష్టం చేశారు.

జనవరి 6, 2021న యుఎస్ క్యాపిటల్‌పై దాడి జరిగిన తర్వాత అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ ఖాతాను శాశ్వతంగా సస్పెండ్ చేయాలనే నిర్ణయం భారతీయ-అమెరికన్ విజయ గద్దెదే అని తెలిసిందే. ట్విటర్ సహ వ్యవస్థాపకుడు బిజ్ స్టోన్ తాజా ఈ ఘటనను ఉద్దేశించి ఒక ట్వీట్‌లో కంపెనీకి చేసిన సహకారానికి.. ముగ్గురికి ధన్యవాదాలు తెలిపారు. "Twitterకి సమిష్టి సహకారం అందించినందుకు @paraga, @vijaya, @nedsegalకి ధన్యవాదాలు. ప్రతిభావంతులు, అందరూ మంచి వ్యక్తులు!" అంటూ ట్వీట్ చేశారు.
తన ట్విట్టర్ బయోని 'చీఫ్ ట్విట్' అంటూ అప్‌డేట్ చేసిన మస్క్, మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్‌ను కొనుగోలు చేయాలనే తన నిర్ణయం వెనుక గల కారణాలను తెలుపుతూ ప్రకటనదారులకు, ఫాలోవర్లకు గురువారం సందేశం పంపారు. టెస్లా చీఫ్ తన ట్విట్టర్‌ని $44 బిలియన్ల కొనుగోలును పూర్తి చేయడానికి కోర్టు విధించిన అక్టోబర్ 28 గడువు కంటే ముందే ట్విట్టర్ టేకోవర్‌ను పూర్తి చేశారు.


Tags:    

Similar News