సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ సింగర్ ఆత్మహత్య

హాంకాంగ్ లో 1975, జనవరి 17న పుట్టిన కోకో లీ.. శాన్ ఫ్రాన్సిస్కోలో పెరిగారు. సింగర్ గానే కాకుండా.. రైటర్, యాక్టర్ గా కూడా..

Update: 2023-07-06 12:58 GMT

singer coco lee

సినీపరిశ్రమలో ఇటీవల వరుస విషాద ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ప్రముఖ సింగర్ ఆత్మహత్య చేసుకుందన్న వార్త ఇండస్ట్రీలో విషాదాన్ని నింపింది. అమెరికన్ సింగర్ కోకో లీ (48) బలవన్మరణానికి పాల్పడిందన్న వార్త ఇండస్ట్రీని కుదిపేసింది. కొంతకాలంగా డిస్పెషన్ తో బాధపడుతున్న కోకో లీ ఆత్మహత్యాయత్నం చేయగా.. కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. హాంకాంగ్ లోని క్వీన్ మేరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోకో లీ మరణించింది.

హాంకాంగ్ లో 1975, జనవరి 17న పుట్టిన కోకో లీ.. శాన్ ఫ్రాన్సిస్కోలో పెరిగారు. సింగర్ గానే కాకుండా.. రైటర్, యాక్టర్ గా కూడా కోకోలీ అలరించారు. సింగర్ గా ఆమె కెరియర్ స్టార్ట్ చేసి ఈ ఏడాదికి 30 ఏళ్లు పూర్తవుతుంది. లీ మరణంతో ఆమె కుటుంబ సభ్యులు, అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. డిప్రెషన్ కారణంగా ఆత్మహత్యాయత్నం చేసిన లీ.. ఆ తర్వాత కోమాలోకి వెళ్లిందని, జులై 5న ఆమె మరణించినట్లు ఆమె సిస్టర్స్ తెలిపారు. హిడెన్ డ్రాగెన్ సినిమాలో ఎ లవ్ బిఫోర్ టైమ్ అనే పాటకు గానూ కోకో లీ ఆస్కార్ అవార్డుకు కూడా నామినేట్ అయ్యారు. లీ మరణం పట్ల సినీ, సంగీత రంగాలకు చెందిన ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.


Tags:    

Similar News