Turkey : టక్కుటమార టర్కీకి భారత్ దెబ్బ మామూలుగా లేదుగా?

బాయ్ కాట్ టర్కీ నినాదం భారత్ లో ఊపందుకుంది.

Update: 2025-05-17 02:44 GMT

చేసుకున్నోడికి చేసుకున్నంత.. అన్నట్లు తయారైంది టర్కీ పరిస్థితి. బాయ్ కాట్ టర్కీ నినాదం భారత్ లో ఊపందుకుంది. టర్కీ లోని పలు ప్రాంతాలకు ముందుగా బుక్ చేసుకున్న ఫ్లైట్ టిక్కెట్లను కూడా కాన్సిల్ చేసుకున్నారంటే ఏ రేుంజ్ లో ఆ దేశానికి భారత్ నుంచి షాక్ తగిలిందో చెప్పకనే తెలుస్తుంది. టర్కీ నుంచి ఏ వస్తువులను కూడా దిగుమతులు చేసుకోకూడదని వ్యాపారులు స్వచ్ఛందంగా నిర్ణయించుకోవడంతో ఆర్థికంగా వేల కోట్ల రూపాయలు నష్టపోయినట్లయింది. టర్కీ చేజేజుతులా చేసుకున్న పనికి అనుభవించాల్సి వస్తుంది. భారత్ - పాకిస్తాన్ ల మధ్య ఉద్రిక్తతలు తలెత్తిన నేపథ్యంలో పాక్ కు టర్కీ ఆయుధాలను సరఫరా చేయడంతో పాటు డ్రోన్లు, క్షిపణులను అందించడాన్ని భారతీయులు ప్రతి ఒక్కరూ సీరియస్ గా తీసుకున్నారు. బాయ్ కాట్ టర్కీ నినాదం హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ లో ఉంది. యాపిల్స్ దిగుమతిని తొలుత నిషేధించిన వ్యాపారులు ఇంకా అనేక రకాలుగా ఆ దేశ వస్తువులను బహిష్కరిస్తున్నారు. టర్కీ దేశానికి వెళ్లేందుకు టిక్కెట్లను కూడా రద్దు చేసుకున్నారు.

యాపిల్స్ తో మొదలయి...
యాపిల్స్ ను బహిష్కరించడంతోనే పన్నెండు వందల కోట్ల రూపాయల మేరకు టర్కీ నష్టపోయింది. దీంతో పాటు తాజాగా టర్కీకి చెందిన సెలెబీని కూడా పక్కనపెట్టింది. దీంతో ఆ కంపెనీ షేర్ ధర పది శాతం పతనమయింది. ఇప్పటి వరకూ ముప్ఫయి శాతం షేర్ ధరలు పడిపోయాయని అంటున్నారు. సెలెబీ సబ్సిడరీ కంపెనీ ద్వారా భారత్ లోని అనేక విమానాశ్రయాల్లో సరుకుల రవాణాతో పటు మరికొన్ని సేవలను అందిస్తూ వచ్చింది. అయితే భారత్ ప్రభుత్వం తాజాగా సెలెబీకి ఉన్న సెక్యురిటీ క్లియరెన్స్ లు రద్దు చేయడంతో అనేక ఎయిర్ పోర్టుల నుంచి అది వైదొలగాల్సి వచ్చింది. అదానీ ఎయిర్ పోర్టు సంస్థ కూడా సెలిబీతో ఉన్న ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. దీంతో సెలిబీ సంస్థ తమది టర్కీ కంపెనీ కాదని చెప్పేందుకు ప్రయత్నించింది. టర్కీ దేశాధ్యక్షుడు ఎర్డోగాన్ కుటుంబంతో తమకు సంబంధం లేదని, ఆయన కుమార్తె తమకు బాస్ కాదని కూడా చెప్పినా భారత్ నుంచి వైదొలగాలని చెప్పడంతో భారీగా నష్టం వాటిల్లినట్లయింది.
టర్కీ జ్యుయలరీని...
ఇక టర్కీ నుంచి భారత్ కు దిగుమతి అయ్యే జ్యుయలరీని కూడా వ్యాపారులు నిషేధించారు. టర్కీ డిజైన్ల పట్ల ఎక్కువ మంది ఆకర్షితులవుతారు. ఆ డిజైన్ల కొనుగోలుకు ఎక్కువ మంది ఇష్టపడతారు. అక్షయ తృతీయ రోజు కూడా టర్కీకి చెందిన జ్యుయలరీ ఎక్కువ అమ్ముడుపోయాయి. కానీ వ్యాపారులు తీసుకున్న నిర్ణయంతో ఆ దేశ ఆభరణాలను కొనుగోలు చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. టర్కీ ఆభరణాలను కొనుగోలు చేయడం లక్నోలోని వ్యాపారులు బహిష్కరించినట్లు ప్రకటించారు. టర్కీ లో తయారైన ఆభరణాలను ఇప్పుడు అడిగే వారు కూడా లేరన్నారు. గతంలో ఎక్కువగా అమ్ముడు పోయే ఈఆభరణాలవిక్రయాలను ఇప్పుడు పూర్తిగా నిలిపేసినట్లు వ్యాపారులు తెలిపారు. మొత్తం మీద టర్కీకి అన్ని వైపుల నుంచి భారత్ ఇస్తున్నషాక్ లకు ఇప్పట్లో తేరుకునే పరిస్థితులు మాత్రం కనిపించడం లేదు.


Tags:    

Similar News