ప్రముఖ సింగర్ కన్నుమూత

టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ ఇలా.. అన్ని సినీ పరిశ్రమలను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. నిన్న కన్నడ దర్శకుడు ప్రదీప్

Update: 2022-01-21 12:38 GMT

టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ ఇలా.. అన్ని సినీ పరిశ్రమలను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. నిన్న కన్నడ దర్శకుడు ప్రదీప్ రాజ్ కరోనాతో కన్నుమూసిన విషయం తెలిసిందే. తాజాగా ప్రముఖ సింగర్, బ్యాట్ అవుట్ ఆఫ్ హెల్త్ ఆల్బమ్ తో ప్రపంచ ఖ్యాతి సంపాదించిన యూఎస్ రాక్ స్టార్, నటుడు మీట్ లోఫ్(74) కూడా మరణించారు. మైఖేల్ లీ అని పిలవబడే ఈ అమెరికన్ సింగర్.. సుమారు 6 దశాబ్దాలుగా నటుడిగా కొనసాగుతున్నారు. మైఖేల్ ప్రపంచ వ్యాప్తంగా 100 మిలియన్లకు పైగా ఆల్బమ్స్ ను విక్రయించినట్లు తెలుస్తోంది.

మీట్ లోఫ్ (మైఖేల్ లీ) మరణాన్ని అతని అధికారిక ఫేస్బుక్ పేజీలో ప్రకటించారు సన్నిహితులు. మీట్ ప్రాణాలు కోల్పోయిన సమయంలో భార్య అతని పక్కనే ఉందని, అతని చివరి 24 గంటలు స్నేహితులతో గడిపారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. కాగా.. మైఖేల్ మరణానికి గల కారణాలను మాత్రం తెలియజేయడానికి కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఇష్టపడలేదు. టెక్సాస్ లో జన్మించిన మీట్.. 1970 ల చివర్లో మీట్ లోఫ్ తన పాటలతో స్టేజి పర్ఫామెన్స్ ఇస్తూ తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్నాడు. 1977లో బ్యాట్ అవుట్ ఆఫ్ హెల్ ఆల్బమ్, అలాగే 'ప్యారడైస్ బై ది డాష్ బోర్డ్ లైట్', 'ఐ యామ్ గొన్నా లవ్ హర్ ఫర్ అస్ బాత్ అస్' వంటి హిట్ పాటలతో ఎంతో ప్రసిద్ధి చెందాడు.



Tags:    

Similar News