Breaking : గుడ్ న్యూస్ ... పాక్ - భారత్ ల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం
పాక్ - భారత్ ల మధ్య ఉద్రిక్తతలు తలెత్తిన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ట్వీట్ తో ఊరట దక్కినట్లయింది
పాక్ - భారత్ ల మధ్య ఉద్రిక్తతలు తలెత్తిన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ట్వీట్ తో ఊరట దక్కినట్లయింది. ఈ మేరకు ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. కాల్పుల విరమణకు భారత్ - పాక్ లు అంగీకరించాయని ట్రంప్ ఎక్స్ లో పోస్టు చేశారు. రెండు దేశాలకు నా అభినందనలు అంటూ ఆయన ట్వీట్ చేయడంతో ఉద్రిక్త పరిస్థితులకు తెరపడినట్లేనని అంటున్నారు.
ఇరు దేశాలతో...
రాత్రంతా తాను రెండు దేశాలకు చెందిన అధినేతలతో చర్చించానని, కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించాయిన తెలిపారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ నుంచి పాక్ కు ఆర్థిక సాయం అందినప్పుడే కొంత అనుమానాలు వచ్చాయి. అమెరికా సూచన మేరకు కాల్పుల విరమణ పాటిస్తేనే తాము ఆర్థిక సాయాన్ని అందిస్తామని షరతు పెట్టి అందుకు తగినట్లుగా ఈ నిర్ణయం పాక్ తీసుకుందని తెలిసింది. మరొక వైపు పాక్ విదేశాంగ శాఖ మంత్రి కూడా భారత్ - పాక్ కాల్పుల విరమణకు అంగీకరించాయని చెప్పారు. ఇరు దేశాలు చర్చల ద్వారానే సమస్యలను పరిష్కరించుకోవాలని ట్రంప్ సూచించారు.