సెప్టెంబర్ 7న బ్లడ్ మూన్

సెప్టంబరు ఏడవ తేదీన సపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది

Update: 2025-09-01 02:14 GMT

సెప్టంబరు ఏడవ తేదీన సపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. రాత్రి 8.58 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు తెల్లవారు జామున 1.25 గంటల వరకు చంద్రగ్రహణం ఉంటుందని ఖగోళ శాస్త్రవేత్తలు చెప్పారు. సంపూర్ణ చంద్ర గ్రహణం రోజున చందమామ ఎరుపు రంగులో ఉంటాడని, దీనిని బ్లడ్ మూన్ గా కూడా అంటారని వారు చెప్పారు.

కొన్ని ప్రాంతాల్లోనే...
చంద్రగ్రహణం రోజున కనిపించే బ్లడ్ మూన్ కొన్ని ప్రాంతాలకే పరిమితమవుతుందని కూడా ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మనదేశంలోనూ కొన్ని రాష్ట్రాల్లోనే బ్లడ్ మూన్ కనిపించే అవకాశముంది. భారత దేశంలో ఢిల్లీ, ముంబై, కోల్కతా, పుణే, లక్నో, హైదరాబాద్, చండీగఢ్ ప్రాంతాలవారు దీనిని వీక్షించవచ్చు. ఆస్ట్రేలియా, అమెరికా, న్యూజిలాండ్ వంటి దేశాల్లో నేరుగా, స్పష్టంగా చూడొచ్చని తెలిపారు.


Tags:    

Similar News