Plane Crash : అమెరికాలో విమాన ప్రమాదం.. ఆరుగురి మృతి

అమెరికాలో ప్రయివేటు జెట్ కూలింది. ఈ ప్రమాదం నార్త్ కరోలినాలో జరిగింది

Update: 2025-12-19 01:50 GMT

అమెరికాలో ప్రయివేటు జెట్ కూలింది. ఈ ప్రమాదం నార్త్ కరోలినాలో జరిగింది. స్టేట్స్ విల్లే రీజనల్ విమానాశ్రయంలో ఒక జెట్ ల్యాండింగ్ అయ్యేందుకు ప్రయత్నిస్తుండగా కుప్పకూలింది. ప్రమాదం జరిగిన వెంటనే పెద్దయెత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో పలువురు మరణించినట్లు తెలిసింది. దీంతో నార్త్ కరోలినా ఎయిర్ పోర్టును అధికారులు తాత్కాలికంగా మూసివేసినట్లు ప్రకటించారు.

ల్యాండింగ్ సమయంలో...
ప్రమాదం జరిగిన సమయంలో వర్షం పడినట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించినట్లు తెలిసింది. నాస్కార్ మాజీ డ్రైవర్ గ్రెగ్ నడుపుతున్న కంపెనీకి చెందిన విమానంగా తెలిసింది. ల్యాండింగ్ సమయంలోనే విమానం అదుపు తప్పిందని అధికారులు తెిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Tags:    

Similar News