బాత్ రూమ్ లో సీక్రెట్ కెమెరా.. ఇంటి యజమాని అరెస్ట్

హైదరాబాద్ లో ఒక ఇంటి యజమాని సీక్రెల్ కెమెరాలను ఏర్పాటు చేయడంపై పోలీసులకు ఫిర్యాదు అందింది

Update: 2025-10-17 04:49 GMT

హైదరాబాద్ లో ఒక ఇంటి యజమాని అశోక్ సీక్రెట్ కెమెరాను ఏర్పాటు చేయడంపై పోలీసులకు ఫిర్యాదు అందింది. మధురానగర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. అద్దెకు ఇచ్చిన ఇంటి బాత్ రూమ్ లో సీక్రెట్ కెమెరాను ఇంటి యజమాని అశోక్ ఏర్పాటు చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. బాత్ రూంలో ఉన్న బల్బులో సీక్రెట్ కెమెరా ఉన్నట్లు గుర్తించిన అద్దెకు ఉన్న వ్యక్తి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.

ఇంటియజమానిని...
ప్రస్తుతం ఈ సీక్రెట్ కెమెరాకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. పోలీసులు ఇప్పటికే ఇంటి యజమానిని అరెస్ట్ చేవారు. అయితే యజమానికి సహకరించిన ఎలక్ట్రీషియన్ చింటూ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Tags:    

Similar News