నిండుకుండలా హుస్సేన్ సాగర్

భారీ వర్షాలతో హుస్సేన్ సాగర్ నీటిమట్టం పెరిగింది. ట్యాంక్ బండ్ లో వరద నీరు పెరగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

Update: 2025-07-25 04:24 GMT

భారీ వర్షాలతో హుస్సేన్ సాగర్ నీటిమట్టం పెరిగింది. ట్యాంక్ బండ్ లో వరద నీరు పెరగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. గత నాలుగు రోజుల నుంచి హైదరాబాద్ లో కుండపోత వర్షం కురుస్తుంది. ఎగువ నుంచి వస్తున్న నీటితో హుస్సేన్ సాగర్ నిండుకుండను తలపిస్తుంది. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచించారు.

నీటిమట్టం...
హుస్సేన్ సాగర్ పూర్తి నీటి మట్టం సామర్ధ్యం 513.41 మీటర్లు కాగా హుస్సేన్ సాగర్ నీటిమట్టం 513.24 మీటర్లకు చేరుకుంది. హుస్సేన్ సాగర్ ఇన్ ఫ్లో 1081 క్యూసెక్కులు కాగా ఔట్ ఫ్లో 789 క్యూసెక్కులుగా ఉంది. నిండు కుండల్లా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జంట జలాశయాలు ఉండటంతో జంట జలాశయాల్లోకి భారీగా చేరుతున్న వరద నీరు చేరుతుంది.


Tags:    

Similar News