అన్నీ సర్వేలు కాంగ్రెస్ వైపే : మంత్రి ఉత్తమ్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలుపు కాంగ్రెస్ దేనని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలుపు కాంగ్రెస్ దేనని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. అన్నీ సర్వేలు హాస్తం వైపే ఉన్నాయన్నారు. నవీన్ యాదవ్ గెలుపు లాంఛనమేనన్న ఉత్తమ్ పదేళ్ల బి.ఆర్.ఎస్ పాలనలో పేదలు నిర్లక్ష్యానికి గురయ్యారని అన్నారు. ఇరవై నెలల కాంగ్రెస్ పాలనలో కోటి 15 లక్షల తెల్ల రేషన్ కార్డులను ఇచ్చామని, ఒక్క జూబ్లిహిల్స్ నియోజకవర్గం లోని పేదలకే 40 వేల తెల్ల రేషన్ కార్డుల మంజూరు చేసినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.
నవీన్ యాదవ్ గెలుపు లాంఛనమే...
ఎస్.సి,ఎస్.టి,బి.సి,మైనారిటీ నిరుపేదలకు నాణ్యమైన సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని, సన్నబియ్యం పంపిణీతో రాష్ట్ర వ్యాప్తంగా 3 కోట్ల 15 లక్షల మందికి లబ్ది చేకూరుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. జూబ్లిహిల్స్ శాసనసభ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో అంతిమ విజయం కాంగ్రెస్ పార్టీదే నని రా ధీమా వ్యక్తం చేశారు.అన్నీ సర్వేలు హస్తం వైపే వెలువడడమే ఇందుకు తార్కాణమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఇక్కడి నుండి బరిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు నల్లేరు మీద నడకే నని ఆయన తేల్చిచెప్పారు.