Hyderabad : నేటి నుంచి హైదరాబాద్ లో రెండు పాస్‌పోర్టు సేవా కేంద్రాలు ప్రారంభం

నేడు హైదరాబాద్ నగరంలో రెండు పాస్‌పోర్టు సేవా కేంద్రాలు ప్రారంభం కానున్నాయి.

Update: 2025-09-16 04:26 GMT

నేడు హైదరాబాద్ నగరంలో రెండు పాస్‌పోర్టు సేవా కేంద్రాలు ప్రారంభం కానున్నాయి. రాయదుర్గం, మహ్మాత్మాగాంధీ బస్ స్టేషన్ మెట్రోరైల్ స్టేషన్‌లో పాస్ పోర్టు కేంద్రాలు ప్రారంభం కానున్నాయి. నేటి నుంచి మరో అందుబాటులోకి పాస్‌పోర్టు సేవాకేంద్రాలు వస్తుండటంతో నగర ప్రజలకు చాలా వరకూ ఊరట లభిస్తుందని చెబుతున్నారు.

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేత...
రాయదుర్గం, మహ్మాత్మాగాంధీ బస్ స్టేషన్ మెట్రోరైల్ స్టేషన్‌లోని పాస్‌పోర్టు సెంటర్లను కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ రెండు పాస్ పోర్టు సేవాకేంద్రాలు అందుబాటులోకి రావడం వల్ల మిగిలిన చోట్ల రద్దీ తగ్గుతుందని, అలాగే నగర ప్రజలు కూడా పాస్ పోర్టు కేంద్రాలకు సులువుగా చేరుకునేందుకు అవకాశం ఏర్పడుతుందనిచెబుతున్నారు.


Tags:    

Similar News