అబ్దుల్లాపూర్‌ మెట్‌ లో విషాదం.. వాగు వద్ద ఫొటోలు దిగుతూ

అబ్దుల్లాపూర్‌ మెట్‌ లో విషాదం చోటు చేసుకుంది. వాగు వద్ద ఫోటోలు దిగుతూ ముగ్గురు యువకులు నీటిలో పడిపోయారు

Update: 2025-09-22 13:41 GMT

అబ్దుల్లాపూర్‌ మెట్‌ లో విషాదం చోటు చేసుకుంది. వాగు వద్ద ఫోటోలు దిగుతూ ముగ్గురు యువకులు నీటిలో పడిపోయారు. ఈత తెలిసిన ఇద్దరు యువకులు మాత్రం క్షేమంగా బయటపడ్దారు. అయితే అందులో పదిహేడేళ్ల సాయి తేజ నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. డిజాస్టర్ టీంలు గాలింపు జరిపినా ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

రసూల్ పురకు చెందిన వారిగా...
అధికారుల నిర్లక్ష్యంపై కుటుంబ సభ్యుల ఆవేదన చెందుతున్నారు. గజ ఈత గాళ్లు, బోట్లు లేవని కుటుంబ సభ్యుల ఆరోపిస్తున్నారు. తమ బిడ్డను రక్షించాలని ప్రభుత్వాన్ని తల్లిదండ్రులు వేడుకుంటు్నారు. ముగ్గురు యువకులు బేగంపేట రసూల్‌పురాకు చెందినవారుగా చెబుతున్నారు. ఇంకా కొట్టుకుపోయిన సాయితేజ కోసం డిజాస్టర్ మేనేజ్ మెంట్ గాలింపుచర్యలు కొనసాగిస్తుంది.


Tags:    

Similar News