శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వెళ్లే దారిలో భారీగా ట్రాఫిక్ జామ్

హైదరాబాద్ లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లే రహదారిపై

Update: 2023-09-23 11:48 GMT

హైదరాబాద్ లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లే రహదారిపై వాహనాలను ఆపేశారు. అందుకు కారణం రోడ్డుపై స్థానికులు ఆందోళనకు దిగడమే..! ఆ రోడ్డుపై ప్రతి రోజూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు నిరసన వ్యక్తం చేశారు. ఎయిర్ పోర్ట్ కు వెళ్లే ప్రధాన రహదారిపై మృతదేహంతో సిద్ధాంతి గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించారు. సిద్ధాంతి గ్రామానికి చెందిన యాదయ్య అనే వ్యక్తి రోడ్డు దాటుతుండగా ఆక్సిడెంట్ కావడంతో అక్కడిక్కడే చనిపోయాడు.. దీంతో గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎయిర్ పోర్టుకు వెళ్లే దారి, వాహనాలు వేగంగా వస్తుండడంతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ ఉన్నారు. తమ ప్రాణాలు పోతున్నాయని రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. గ్రామస్తులు మాట వినకపోవడంతో పోలీసులు వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కిలోమీటర్ల దూరం భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. శంషాబాద్‌-గగన్‌పహాడ్‌ వరకు భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో ఇరువైపుల భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఎయిర్‌పోర్టుకు వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.


Tags:    

Similar News