హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై ట్రాఫిక్ రద్దీ

హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై ట్రాఫిక్ రద్దీ ఏర్పడింది

Update: 2026-01-18 03:15 GMT

సంక్రాంతి పండగకు తిరుగు ప్రయాణం చేసే వారి సంఖ్య ఎక్కవ కావడంతో హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై ట్రాఫిక్ రద్దీ ఏర్పడింది. దాదాపు వారం రోజుల పాటు సంక్రాంతి సెలవులకు ఆనందంగా గడిపిన ప్రజలు తిరిగి రేపటి నుంచి విధుల్లోకి చేరడానికి హైదరాబాద్ చేరుకుంటున్నారు. దీంతో నిన్నటి నుంచే హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారి పై వాహనాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆదివారం అమావాస్య కావడంతో ఎక్కువ మంది నిన్ననే హైదరాబాద్ కు తరలి వచ్చారు.

నేడు కూడా...
అయితే అమావాస్య సెంటిమెంట్ లేని వాళ్లు నేడు ప్రయాణాలు పెట్టుకున్నారు. ఉదయం నుంచి వాహనాల రద్దీ హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారి కనపడుతుంది. దీంతో పోలీసులు అన్ని చోట్ల పికెట్లు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ నిలిచిపోకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. నిన్న రాత్రి ఏడు గంటల మధ్య ట్రాఫిక్ భారీగా పెరిగినట్లు టోల్ గేట్ నిర్వాహకులు చెబుతున్నారు. సంక్రాంతి పండగకు హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారి పై దాదాపు మూడు లక్షలకు పైగా వాహనాలు వెళ్లాయి.
దారి మళ్లించినా..
అవన్నీ తిరిగి హైదరాబాద్ కు చేరుకోవడానికి వస్తుండటంతో ఒక్కసారిగా రద్దీ పెరిగింది. టోల్ గేట్ల వద్ద ఎక్కువ సమయం పడుతుంది. టోల్ గేట్లు దాటడానికి ఎక్కువ సమయం పడుతుందని తెలిపారు. అప్పటికీ టోల్ గేట్ నిర్వాహకులు హైదరాబాద్ వైపు వచ్చే టోల్ గేట్లను ఎక్కువ సంఖ్యలో తెరిచారు. దీంతో రద్దీని అరికట్టడానికి కొంత సులువుగా మారింది. అయితే అక్కడకక్కడ రహదారి పనులు జరుగుతుండటంతో వాహనాలు నెమ్మదిగా సాగుతున్నాయి. హైదరాబాద్ కు వచ్చే వాహనాలను దారి మళ్లించినప్పటికీ ట్రాఫిక్ ఇబ్బందులు తప్పడం లేదు. దీంతో వాహనదారులు కొంత అసహనం వ్యక్తం చేస్తున్నారు.

















Tags:    

Similar News