Hyderabad : బ్రిలియంట్ చోరీ..కోటి నగదు అపహరణ

హైదరాబాద్ లోని బ్రిలియంట్ ఇంజినీరింగ్ కళాశాలలో భారీ చోరీ జరిగింది

Update: 2025-10-10 12:41 GMT

హైదరాబాద్ లోని బ్రిలియంట్ ఇంజినీరింగ్ కళాశాలలో భారీ చోరీ జరిగింది. కోటి రూపాయల నగదు చోరీకి గురయింది. హైదరాబాద్ నగరం శివారులో ఉన్న అబ్దుల్లాపూర్ మెట్ లో బ్రిలియంట్ ఇంజినీరింగ్ కళాశాల ఉంది. అయితే కోటి రూపాయల నగదును చోరీ చేసిన దుండగులు గుట్టు చప్పుడు కాకుండా వెళ్లిపోయారు. బ్రిలియంట్ ఇంజినీరింగ్ కళాశాల యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగు చూసింది.

సీసీటీవీ ఫుటేజీ పరిశీలనతో...
కోటి రూపాయల నగదు ఉన్నప్పుడు దానికి తగినట్లుగా సెక్యూరిటీ పెట్టుకోలేదా? ఎవరు ఈ నగదును తీసుకెళ్లారు? తెలిసిన వారి పనేనా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే కళాశాల ప్రాంగణంలో ఉన్న సీసీ టీవీ పుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. దుండగుల కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.


Tags:    

Similar News